సీపీఐ(ఎం) బహిరంగ సభను విజయవంతం చేయాలి

CPI(M) should make the public meeting a successనవతెలంగాణ – బొమ్మలరామారం
డిసెంబర్ 15న చౌటుప్పల్ లో జరిగే సీపీఐ(ఎం) జిల్లా బహిరంగ సభను విజయవంతం చేయాలని మండల కార్యదర్శి ర్యకల శ్రీశైలం అన్నారు. మండల కేంద్రంలోని శనివారం బహిరంగ సభ కడపత్రాలను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ…అంతర్జాతీయంగా క్రూడ ఆయిల్ ధరలు 105 డాలర్లకు ఒక   బేరల్ ఉన్నప్పుడు రూ55కు అందుబాటులో ఉన్న లీటర్ పెట్రోల్ నేడు72 డాలర్లకు ఒక బేరల్ ఉండగా లీటర్ పెట్రోల్ రూ 109 ఉందని బిజెపి ప్రజా వ్యతిరేక పాలనకు ఇది నిదర్శనం అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ప్రజల నిత్యవసరాల ధరలు  పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తుందని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా సమస్యల పై నిరంతరం పోరాడుతూన్న సీపీఐ(ఎం) బహిరంగ సభకు బొమ్మలరామారం మండల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దేశెట్టి సత్యనారాయణ, మేకల మంగ, యాదయ్య, లక్ష్మి, ప్యారారం వెంకటేష్ ,భాగ్య ,రమేష్ ,తదితరులు పాల్గొన్నారు.