ఈ నెల 21 నుండి 23 వరకు జిల్లా కేంద్రం అయిన కొత్తగూడెం జరుగుతున్న ఐద్వా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం అయిన సుందరయ్య భవన్ లో పార్టీ మండల కమిటీ ఆద్వర్యంలో, మండల కన్వీనర్ బుడితి చిరంజీవి నేతృత్వంలో మండల కమిటీ సభ్యులు మడకం గోవిందు అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో పుల్లయ్య మాట్లాడారు. మహిళలు అనేక రంగాల్లో రాణిస్తున్నారు అని, అయినా వారు వివక్ష ఎదుర్కొంటున్నారని అన్నారు. మహిళా సమస్యలు ఈ మహాసభల్లో చర్చించి తీర్మానాలు చేస్తారని అన్నారు. జాతీయ నాయకురాలు బృందా కారత్ హాజరయ్యే మొదటి రోజు భహిరంగ సభకు మహిళలు భారీగా తరలిరావాలని విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశంలో మండల కమిటీ సభ్యులు, ఐద్వా నాయకురాలు తగరం నిర్మల, మండల కమిటీ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు, మురళీ, సీతారామయ్య, రం అప్పారావు లు పాల్గొన్నారు.