
రైతులకు ఎదురవుతున్న విత్తనాల కొరతను తీర్చి వానకాలపు పంట సహాయము వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సుందరయ్య భవన్ భువనగిరిలో సీపీఐ(ఎం) భువనగిరి మండల కమిటీ సమావేశం మండల కార్యదర్శి వర్గ సభ్యులు కొండ అశోక్ అధ్యక్షతన జరుగగా ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నర్సింహ హాజరై , మాట్లాడారు. వానకాలము రైతులు విత్తనాలు పెట్టే సీజన్ వచ్చినా నేటికీ ప్రభుత్వము తినే వరి విత్తనాలు అందుబాటులో లేకపోవడం రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని పత్తి విత్తనాలు కూడా దొరకడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వము అన్ని రకాల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని, నకిలీ విత్తనాల మీద ప్రభుత్వ నిఘా ఉండాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసినదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్స్ వెంటనే అర్హత కలిగిన వారందరికీ మంజూరు చేసి ఇవ్వాలని, అన్ని గ్రామాలకు బస్సులను నడిపి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య , ఎదునూరి మల్లేశం, అన్నంపట్ల క్రిష్ట , మండల కమిటీ సభ్యులు సిలివేరు ఎల్లయ్య , ఎల్లంల వెంకటేష్ , జిట్టా అంజిరెడ్డి , అబ్దుల్లాపురం వెంకటేష్ , కొండాపురం యాదగిరి లు పాల్గొన్నారు.