చిన్నేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలి: సీపీఐ(ఎం)

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలో సీపీఐ(ఎం) పోరుబాట కార్యక్రమంలో భాగంగ గ్రామ శాఖ ఆధ్వర్యంలో వాగును సందర్శించారు.  ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరు బాలరాజు,  మండల కార్యదర్శి దయ్యాల  నర్సింహ లు మాట్లాడుతూ.. నిత్యం భువనగిరి, బిబినగర్, పోచంపల్లి మండల పరిధిలోని గ్రామాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు ఈ చిన్నేరు వాగు నుండి అనేక మంది  తమ అవసరాల కోసం  ప్రయాణించడం జరుగుతుందనారు.  వర్షాకాలంలో వాగులోని  నీళ్లు వంతెన పై నుండి పోవడం  వలన ప్రజలు తమ రాకపోకలకు అంతరాయం కలుగుతుందని, వెంటనే ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. గతం ప్రభుత్వంలో ఎంఎల్ఏ, మంత్రికి పలు సందర్భాల్లో వినతి పత్రాలు  ఇచ్చినప్పటికీ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయిందనారు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి జిల్లా మంత్రి, ఎంఎల్ఏ, ఎంపీ తక్షణమే స్పందించి ఈ వాగు పై వంతెన నిర్మాణం  చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలన్నింటి పై రాబోయే కాలంలో నిర్వహించే తాసిల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్యకర్తలను ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు గునుగుంట్ల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బొల్లేపల్లి కుమార్, గ్రామశాఖ కార్యదర్శి అబ్దుల్లాపురం వెంకటేష్, ఏదునూరి వెంకటేష్, నాయకులు కడమంచి నరసింహ , ఎండి షాబుద్దీన్, గంగనోయిన  బాలనరసింహ, తోటకూర మల్లేష్, రాయపురం సురేష్, గంగాదరి వెంకటేష్ లు పాల్గొన్నారు.