నవతెలంగాణ – బెజ్జంకి
గత రెండేళ్లుగా నిలిచిపోయిన మినీ స్టేడియం నిర్మాణ పనులు చేపట్టాలని సీపీఐ(ఎం)నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం మండల కేంద్రంలో అర్థాంతరంగా నిలిచిన మినీ స్టేడియాన్ని సీపీఐ(ఎం)మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి సందర్శించి పరిశీలించారు. గుత్తేదారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నిర్మాణ పనులు నిలిచిపోయి అసంపూర్తిగా మినీ స్టేడియం దర్శనిమిస్తోందని ఎమ్మెల్యే ప్రత్యేక చోరవ చూపి నిర్మాణ పనులు చేపట్టాలని తిప్పారపు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గుత్తేదారుపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.నాయకులు బొమ్మిడి సాయి కృష్ణ,సంగ ఎల్లయ్య, రసూల్, అరవింద్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.