నవతెలంగాణ – నూతనకల్
తెలంగాణ రైతంగ పోరాట యోధుడు కల్లుగీత కార్మిక సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మండల తొలి మాజీ జెడ్పిటిసి కామ్రేడ్ తొట్ల మల్సూర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో కామ్రేడ్ స్మారక భవనంలో మల్సూర్ 25వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామంలో 1924 వ సంవత్సరంలో మల్లయ్య కనకమ్మల తొలి సంతానం నిరుపేద గీతా కార్మికుల కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే పాలేరుగా జీవితాన్ని ప్రారంభించారు. అప్పటి భూస్వాముల పెత్తందారీ విధానాలను వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఏర్పడిన గుత్ప సంఘంలో సభ్యుడిగా తన 17వ ఏట ఉద్యమంలో చేరారు. నాటి సూర్యాపేట ప్రాంత కమ్యూనిస్టు ఆర్గనైజర్లు మద్దికాయల ఓంకార్, భీమ్ రెడ్డి నరసింహారెడ్డి ల శిక్షణలో కమ్యూనిస్టు గెరిల్లాగా మారి దళ సభ్యుడిగా పనిచేశారు. మొదట బి ఎన్ దళంలో ఉన్న అతను దళ నాయకుడు స్థాయికి ఎదిగారు. తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలనకు, భూస్వామి వ్యవస్థకు వ్యతిరేకంగా వెట్టిచాకిరి రద్దు చేసి దున్నేవానికి భూమి, గీసే వారికి చెట్టు నినాదం చేసేనారు. తుంగతుర్తి నియోజకవర్గం ఎడారిగా మారిన ఆనాడే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి నియోజకవర్గానికి సాగు తాగు నీరు అందించాలని కామ్రేడ్ బి.ఎన్.రెడ్డి తో ఎన్నో పోరాటాలు చేశారు. రైతాంగానికి ,కార్మికులకు, కర్షకులకు అండగా ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర అతనిది. నల్లగొండ వరంగల్ ఖమ్మం కరీంనగర్ జిల్లాలోని గీత కార్మికులను సంఘటితంగా ఐక్యపరిచారు. దొరలు భూస్వాముల దౌర్జన్యం నుండి విముక్తి కోసం చెట్టు పన్ను భూమి యజమాని పన్ను ,అడ్డ పన్ను పేరుతో రకరకాల పనులు వృత్తిమీద వేసి అనేక ఇబ్బందులకు గురి చేస్తూ మన తెలంగాణ ప్రాంతంలో వేలంపాటలకు వ్యతిరేకంగా బొమ్మగాని ధర్మ బిక్షం కళ్లెపు వెంకటయ్య దేశిని చిన్న మల్లయ్య బైరు మల్లయ్య వీరి నాయకత్వంలో వృత్తి రక్షణకై జరిగిన పోరాటాలలో పాల్గొన్నారు.1948 లో తెలంగాణ ప్రాంతం భారత ప్రభుత్వంలో విలీనమైనది అయినప్పటికీ తెలంగాణ ప్రాంతంలో నైజం రాజులు ఏర్పాటు చేసి ఆప్కారి విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు ప్రధానంగా వేలంపాటలు విధానం రద్దు చేయాలని సొసైటీలు ఏర్పాటు చేయాలని అతిపెద్ద పోరాటాలు తెలంగాణలో నిర్వహించడం జరిగింది.ఆ రకంగా ఆంధ్ర ప్రాంతం పోరాటాలని తెలంగాణ ప్రాంతం పోరాటాలను సంయమనం చేస్తూ 1978 లో సంఘాన్ని పునర్నిర్మాణం చేసి ఆగస్టు 25 న హైదరాబాదులో జరిగిన రెండవ మహాసభలో రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర కల్లు గీతా కార్మిక సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.1986లో జరిగిన 6వ మహాసభ వరకు కొనసాగారు. ఆయన కర్ణాటక లోని గుల్బర్గా జైల్లో తర్వాత మహారాష్ట్రలోని జల్నా జైలు లో ఎన్నో సంవత్సరాలు జైలు జీవితాలు గడిపాడు.జైల్లోనే విద్య అభ్యసనాన్ని నేర్చుకున్నారు. తుంగతుర్తి డివిజన్లో దేశ్ముఖ్ జెన్నారెడ్డి ప్రతాపరెడ్డి లాంటివారి భూస్వామ్య విధానాలను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేశారు.మండల తొలి జడ్పిటిసిగా గెలుపొంది ప్రజా సేవలు చేశాడు.అతని జీవిత చరిత్రను పోరాట చరిత్రను నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం పార్టీ కోసం పార్టీ చేసే ప్రతి ఉత్సవంలో పాల్గొనాలని యువతకు సూచించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సాయుధ పోరాట మండల కార్యదర్శి శంకర్ రెడ్డి, ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పులుసు సత్తయ్య, జిల్లా నాయకులు దేవరకొండ యాదగిరి, మండల నాయకులు బొజ్జ శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ముండ్ల సంజీవ పులుసరి వెంకట ముత్యం, తొట్ల లింగయ్య,తొట్ల ఆనంద్, బాణాల విజయభాస్కర్ రెడ్డి, సామ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.