– ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్
తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఐసిడిఎస్ ఆఫీసు ముందు జరుగుతున్న 9వ రోజు నిరవధిక సమ్మె లో భాగంగా బతుకమ్మలాడుతూ నిరసన తెలిపారు. సమ్మె శిబిరానికి సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి హాజరై మద్దతు ప్రకటించి మాట్లాడుతూ రాష్ట్రంలో 70 వేల మంది గత 48 సంవత్సరాలుగా పేద మహిళలకు రక్తహీనత పిల్లలకు పౌష్టికాహారం అందించడం కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయుటకు ఎంతగానో కషి చేస్తున్న అంగన్వాడి టీచర్లకు ఆయాలకు అతి తక్కువ వేతనాలు ఇస్తూ వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఇందులో 90 శాతం మంది దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలని వారిని వెంటనే పర్మినెంట్ చేయాలని ఆలోపు వారికి గౌరవ వేతనాలు కాకుండా కనీస వేతనం టీచర్ కు 26 వేలు, ఆయాకు 18 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిఎఫ్, ఈఎస్‌ఐ, గ్రాడ్యుటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులు అధికారులు బెదిరింపులకు పాల్పడడం సిగ్గుచేటు విమర్శించారు. నల్లగొండ జిల్లా నాటి నైజాం సర్కార్ ను తరిమికొట్టిన పోరు గడ్డ అని వీర వనిత చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని అందుకున్న అంగన్వాడీ మహిళలని వారిని ఎమ్మెల్యేలు బెదిరిస్తే భయపడేది లేదని వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే పోరాడుతున్న అంగన్వాడీ సంఘాల జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని లేనిపక్షంలో అంగన్వాడీలు చేసే పోరాటాల్లో సిపిఎం ప్రత్యక్షంగా పాల్గొంటూ వారికి అండదండలుగా ఉంటూ పోరాటాలు మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కే. విజయలక్ష్మి, ప్రమీల, యాదమ్మ, కవిత, రేణుక, కళ్యాణి, పద్మ, సముద్రమ్మ, జ్యోతి, మంగ, ఆయాలు ఎల్లమ్మ, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.
దేవరకొండ: తెలంగాణ రాష్టం లో జరుగుతున్న అంగన్వాడీ సమ్మె పై ప్రభుత్వం స్పందించాలని, లేకపోతే సమ్మెను ఉధతం చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు. దేవరకొండ లో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జరుగుతున్న అంగాన్ వాడీల సమ్మెలో ఆయన మాట్లాడారు. అంగన్వాడీలు చాలీ చాలని వేతనాలతో ఎంత కాలం ఇలా వెట్టీ చాకిరీ చేయాలనీ ఆవేదన వ్యక్తంచేశారు. నేడు కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు మల్లయ్య, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు వనం రాధిక, జిల్లా ఉపాధ్యక్షులు అరుణ, కార్యదర్శి జయ, మమత, సుజాత, నాగమణి, మణమ్మ, స్వప్న, ప్రభావతి, లావణ్య, మహిత, జ్యోతీ, గోపిక, శాంతా బాయి, సువార్త, పార్వతి, లక్ష్మి, కవిత పాల్గొన్నారు.
మర్రిగూడ: అంగన్వాడి ఉద్యోగులు సమ్మెలో ఉన్న సందర్భంగా మంగళవారం కలెక్టర్ ఆదేశాల మేరకు మర్రిగూడ మండలంలోని అన్ని అంగన్వాడి కేంద్రాలలో ఆయా గ్రామాల సర్పంచ్ మరియు గ్రామపంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు ఇన్చార్జి ఇప్పించి అంగన్వాడి కేంద్రంలోని గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు,ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ఆహార పదార్థాలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిడిపిఓ లావణ్య కుమారి, సూపర్వైజర్స్ పద్మ, యశోద,ఆయా గ్రామాల సర్పంచులు,పంచాయతీ కార్యదర్శులు,ఆశా వర్కర్లు తదితరులు, పాల్గొన్నారు.
నకిరేకల్: అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే. ఏసురత్నం డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి తొమ్మిదవ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మద్దతు ప్రకటించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఒంటెపాక వెంకటేశ్వర్లు, అంగన్వాడి టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పొడిచేటి నాగమణి, అంగన్వాడీ టీచర్స్, ఆయాలు పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి: గత తొమ్మిది రోజులుగా సమ్మెలో పాల్గొని సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడిని టీచర్ల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య అన్నారు. మంగళవారం కొండమల్లేపల్లి పట్టణంలోని సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడి టీచర్ల సమ్మెలో పాల్గొని వారికి మద్దతు తెలుపుతూ స్థానిక ఎమ్మార్వో కార్యాలయం నందు ఎమ్మార్వో కు సమ్మె వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహకార దర్శి నల్ల వెంకటయ్య, అంగన్వాని టీచర్లు శోభ, జ్యోతి, మేరీ, భారతమ్మ, సరస్వతి ,సుమలత, కవిత, సుజాత, విజయ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
చింతపల్లి: అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య అన్నారు. మంగళవారం చింతపల్లి మండలంలోని అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె 9వ రోజుకు నా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య గారు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నల్ల వెంకటయ్య వ్యవసాయ కార్మిక సంఘం చింతపల్లి మండల నాయకులు ఊడిగుండ్ల రాములు అంగన్వాడి ఉద్యోగుల సంఘం సిఐటియు నాయకురాలు కే రజిత ఆర్ శోభ శారద అనంతలక్ష్మి సువర్ణ కలమ్మ జయ శ్రీ విమలాదేవి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.