సీపీఐ(ఎం) సానుభూతి పరుడు మృతి…

– నివాళులు అర్పించిన పార్టీ నాయకులు…

నవతెలంగాణ – అశ్వారావుపేట
సీపీఐ(ఎం) సానుభూతి పరుడు,నవతెలంగాణ విలేకరి మడిపల్లి వెంకటేశ్వరరావు మామయ్య మేకల వెంకులు వయోభారంతో మంగళవారం మండల పరిధిలోని అచ్యుతాపురంలో తన స్వగృహంలో మృతి చెందారు. వెంకులు మృతి సమాచారం తెలుసుకున్న సీపీఐ(ఎం) జిల్లా కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు పుల్లయ్య,జిల్లా కమిటీ సభ్యులు అర్జున్ రావు పిట్టల,దొడ్డ లక్ష్మినారాయణ,దమ్మపేట మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు లు వెంకులు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.అల్లుడు మడిపల్లి వెంకటేశ్వరరావు ను పలువురు పరామర్శించారు. వెంకులు భార్య మహా లక్ష్మి, కుమారులు లక్ష్మణ్ రావు, రవిలు గతంలోనే పలు అనారోగ్య కారణాలతో మృతి చెందగా ప్రస్తుతం ఒక్క కూతురు లక్ష్మి మాత్రమే ఉన్నారు.