ఎండిపోయిన వరి పొలాలను నష్టపరిహారం చెల్లించాలి: సీపీఐ(ఎం) 

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం మందల్లోగూడెం గ్రామంలో సీపీఐ(ఎం)  జిల్లా కార్యదర్శి ఎండి జాంగీర్ ఆధ్వర్యంలో ఎండిపోయిన పంట పొలాలను ఆదివారం పరిశీలించారు. వల్లూరి శ్రీశైలం అనే రైతు 12 ఎకరాలు వరి నాటు వేసి ఈరోజుకి పూర్తిగా ఎండిపోయిందని అన్నారు. ఒక ఎకరానికి 30 వేల వరకు ఖర్చు వచ్చిందని తెలిపారు. గ్రామంలో వరి పంటలు ఎండిపోవడంతో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. మండలంలో ఎండిపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఎండి జాంగీర్ డిమాండ్ చేశారు. ఆరుగాలం శ్రమించి వరి నాట్లు వేసి ఎండిపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని అన్నారు. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జాంగీర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమం లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి చిన్న కొండూరు ఎంపిటిసి చెన్నబయిన వెంకటేశం సింగిల్ విండో మాజీ చైర్మన్ చిర్క సంజీవరెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ బోరెం నర్సిరెడ్డి సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు పొట్ట శ్రీను,కొండే శ్రీశైలం,సప్పిడి లక్ష్మిరెడ్డి,మంద బుచ్చిరెడ్డి, మాజీ వార్డు సభ్యులు పాపగళ్ళ లింగస్వామి, కస్తూరి లింగస్వామి,చిర్క అలివేలు,శేఖర్,అలివేలు, హరీష్,శ్రీను,నరసింహారెడ్డి,లింగారెడ్డి,ప్రశాంత్, వెంకటేష్,లింగయ్య తదితరులు పాల్గొన్నారు.