నవతెలంగాణ – అచ్చంపేట
నీట్ పేపర్ లీకేజీ పైన సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గం పర్వతాలు డిమాండ్ చేశారు. పట్టణంలోని పటేల్ ఫంక్షన్ హాల్ లో డివిజన్ స్థాయి సీపీఐ(ఎం) పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు రెండవ రోజు జరిగాయి. భారతదేశ చరిత్ర కమ్యూనిస్టుల పాత్ర అనే అంశంపై పర్వతాలు బోధించారు. దేశవ్యాప్తంగా 25 లక్షల మంది నీటి పరీక్ష రాస్తే మొదటి ర్యాంకు 67 మందికి రావడానికి పేపర్ లీకేజీ చేసిన బీజేపీ రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించ మోడీ వెంటనే దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నీట్ పరీక్ష లీకేజీ పై తక్షణమే నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందించి నిందితుల పైన కఠినమైనటి చర్యలు తీసుకోవాలని, నీట్ పరీక్షల నిర్వహణ ఆయా రాష్ట్రాల బాధ్యత ఇవ్వాలని అన్నారు. నీట్ పరీక్ష రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని ఆయన అన్నారు. దేశ భవిష్యత్తుతో మోడీ చలగాటమాలడం సరికాదన్నారు. దేశ భవిష్యత్తు తీర్చిదిద్దే విద్యార్థుల పరీక్షలలో పద్ధతులు వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఎందుకు పేపర్ లీకేజీలు అవుతున్నాయని వారు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా పరీక్ష కన్నా ముందే పేపర్ల లీకేజ్ అవుతుంటే ఆట బొమ్మలాడుతున్నట్లుగా వ్యవహరించే తీరు సరైన పద్ధతి కాదన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం విద్యారంగాన్ని గాలికి వదిలేసి మాయల పకీరు మాటలు చెప్పుతూ పూట గడపాలని చూస్తుందన్నారు.

ఇప్పటికైనా నీట్ పరీక్షను రద్దుచేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ దేశంలో ప్రతిష్టాత్మకంగా దేశ ప్రజలకు వైద్యం అందించే రంగంలో నిష్ణాతులైనటువంటి విద్యలో ప్రావీణ్య కలిగినటువంటి వ్యక్తులకు నిర్వహించే పరీక్షలలో ఒకటి రెండు మూడు ర్యాంకుల కంటే ఎప్పుడు రానటువంటిది. ఈసారి మొదటి ర్యాంకు 67 మందికి రావడం అంటే ఆ వ్యవస్థ పట్ల బీజేపీ ప్రభుత్వము నిర్వహిస్తున్న నిర్లక్ష్య ధోరణి సరైనది కాదన్నారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు జడ్జిలచే విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. లేనిచో దేశవ్యాప్తంగానే అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశ్య నాయక్, అచ్చంపేట మండల కార్యదర్శి మల్లేష్, బల్మూరు మండల కార్యదర్శి శంకర్ నాయక్, ఉప్పునూతల మండల కార్యదర్శి నాగరాజు, నాయకులు సైదులు, లాల్మమ్మ , భారిమం, రాజు, శివకుమార్ , కృష్ణయ్య, లక్ష్మయ్య, దాసు , శివలీల, రజిత, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.