– సీపీఐ(ఎం) ప్రజల తరపున చేసిన పోరాటాలు ఏవి వృధా కాలేదు..
– రైతాంగం పట్ల కేంద్రం విధానాలు మార్చుకోవాలి…
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం..
నవతెలంగాణ – మునుగోడు
ఎన్నో సంవత్సరాల సీపీఐ(ఎం) పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం డిండి ప్రాజెక్టుకు డిపిఆర్ ను ప్రకటించడం సిపిఎం స్వాగతిస్తుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం హర్షం వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో నిర్వహించిన సీపీఐ(ఎం) మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) పోరాట ఫలితంగా ప్రజలకు ఎన్నో రకాల ఉపయోగాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ కూలీలకు 12 వేలు , రైతు భరోసా ప్రకటించడం సీపీఐ(ఎం) ఒత్తిడి ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి ఆమోదం తెలిపిందని తెలిపారు. సీపీఐ(ఎం) ప్రజల తరపున చేసిన పోరాటాలు ఏవి వృధా కాలేదని అన్నారు. ప్రజా సమస్యల పైన నికరంగా నిలబడి పోరాటాలు నిర్వహిస్తున్న పార్టీ సీపీఐ(ఎం) ఎర్రజెండా పార్టీ అని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పైన నికరంగా పోరాడే పార్టీని బలపరచాలని, ప్రజల హక్కుల కోసం, ప్రజలంతా ఐక్యంగా నిలబడాలని కోరారు. భవిష్యత్తులోనూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నికరంగా, నికాచుగా పేద ప్రజలకు తరపున పోరాడుతామని తెలిపారు. రైతాంగం పట్ల కేంద్ర ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలని, లేదంటే ప్రతిఘటన తప్పదని అన్నారు. మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చిన మోడీ ప్రభుత్వం రైతుల పోరాటంలోవెనక్కి తగ్గిన.. చాప కింద నీరులా మళ్లీ అమలు చేయడానికి పూనుకుందన్నారు. రైతులకు నష్టం చేసే చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్ , మండల కమిటీ సభ్యులు యాస రాణి శ్రీను, వరికుప్పల ముత్యాలు , వడ్లమూడి హనుమయ్య , వేముల లింగస్వామి , కొంక రాజయ్య , కట్ట లింగస్వామి , పగడాల కాంతయ్య తదితరులు ఉన్నారు.