
కేంద్ర ప్రభుత్వ మహిళా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడి, సాధించుకున్న హక్కులను కాపాడుకుందామని సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 114వ దిన సందర్భంగా పట్టణంలోని మామిడిపల్లి లో శుక్రవారం మహిళా సంఘం (పిఓడబ్ల్యూ) నాయకురాలు మమ్మది అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దాసు పాల్గొని మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా 11 4 వై దినోత్సవం 1910 సంవత్సరం లో డెన్మార్క్ రాజధాని అయిన కోఫెన్ హగన్ రెండవ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ లో ప్రకటించబడిందని ఆయన తెలిపారు. జర్మనీకి చెందిన కమ్యూనిస్టు నాయకురాలు క్లారా జెట్కిన్ మార్చి 8 దినాన్ని శ్రామిక దినంగా ప్రకటించాలని ప్రతిపాదించగా మహాసభ ఆమోదించినదని ఆయన తెలిపారు. భారత మాతా కీ జై అంటూనే, బేటి పడావో బేటి బచావో అంటూ నరేంద్ర మోడీ నినదిస్తూనే ప్రతిరోజు వందలాది ఆడపిల్లల ఉసురుపోసుకుంటున్నార ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమోన్మాదంతో దాడులు నిత్య కృత్యం అయ్యాయని ఆయన తెలిపారు. 33 శాతం రిజర్వేషన్ అమలు ఇంకెన్నాళ్లని ఆయన పాలకులను ప్రశ్నించారు.
సామ్రాజ్యవాద సంస్కృతి: యువతను వక్రమార్గం పట్టిస్తున్నాయని, వావి వరుసల్ని చెరిపేస్తున్నాయని ఆయన తెలిపారు. ఆకాశంలో సగం మనం అనంత కోటి నక్షత్రాల్లో సగం మనం అంటూనే ఆడవాళ్ళ ను వివక్షతకు బలి చేస్తూ, రెండవ శ్రేణి పౌరులుగా గుర్తించడం దుర్మార్గమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరకట్న దురాచారాలను, అశ్లీల సాహిత్యాన్ని నిర్మూలించాలని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. శ్రమను మహిళలను గౌరవించే సంస్కృతి పెంపొందించే పాఠ్యాంశాలను విద్యాసంస్థల్లో బోధించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను దాసు కోరారు. ఈ సమావేశంలో మహిళా సంఘం నాయకురాలు లలిత మాట్లాడుతూ మహిళలంటే తేలిక భావంతో
చూడొద్దని, దేశంలో జనాభాలో సగం మంది ఉన్నామని, అన్ని పనుల్లో ముందుంటున్నామనే విషయం గుర్తుంచుకోవాలని ఆమె తెలిపారు. పేద మహిళలకు, విద్యా ,వైద్య, నిలువ నీడ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మతాల పేరుతో మహిళల మధ్య చిచ్చు పెడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అర్థం చేసుకొని రాబోయే ఎన్నికల్లో మోడీని ఓడించాలని మహిళా లోకానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు నాయకులు గంగక్క నరసవ్వ, లక్ష్మి, కాలేదా, షహదా, ఫాతిమాభెగం,కాలనీ అభివృద్ధి కమిటీ నాయకులు, శివకుమార్, పాషా, ఇర్ఫాన్, సమీర్. తదితరులు పాల్గొన్నారు.