జహంగీర్ నామినేషన్ కు తరలివచ్చి జయప్రదం చేయండి: సీపీఐ(ఎం) పిలుపు

నవతెలంగాణ – వలిగొండ రూరల్
ప్రజా నాయకుడు సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ నామినేషన్ కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో  తరలివచ్చి జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు మామిడి వెంకట్ రెడ్డి, సీపీఐ(ఎం)మండల కార్యదర్శి సిర్పంగి స్వామి కోరారు. గురువారం వలిగొండ గ్రామపంచాయతీ పరిధిలోని చింతబాయి వద్ద సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్ గెలుపును కోరుతూ.. ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 19వ తేదీన శుక్రవారం భువనగిరిలో జరుగు నామినేషన్ కార్యక్రమాన్ని ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నేడు పార్లమెంటు ఎన్నికల్లో పేదల కోసం రైతుల కోసం కూలీల కోసం పోరాడే అభ్యర్థిగా జహంగీర్ ముందుకు వచ్చారని అన్నారు. ఒక పేదవాడికి కోటీశ్వరులకు మధ్యన ఈ ఎన్నికల సమరం జరుగుతుందని ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు. పేదల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం నిరంతరం పోరాటాలు నడిపే జహంగీర్ కు అవకాశం ఇచ్చి ఎన్నికల్లో ఎంపీగా గెలిపించాలన్నారు.ఈ కార్యక్రమంలో సత్తిరెడ్డి, అంజిరెడ్డి,నర్సింహ,యాదయ్య తదితరులు పాల్గొన్నారు.