ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ(ఎం) పోరాటం చేస్తుందని ఆ పార్టీ జన్నారం మండల కార్యదర్శి కనికరం అశోక్ అన్నారు. శుక్రవారం జన్నారం మండలం మురిమడుగు గ్రామంలో ఆ పార్టీ శాఖ మహాసభను నిర్వహించారు. ముందుగా ఇటీవలే మృతి చెందిన సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమావేశంలో గ్రామంలో ఉన్న సమస్యలపై చర్చించారు. గ్రామ కార్యదర్శిగా కొండగుర్ల లింగన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కూకట్కారి బుచ్చయ్య అంబటి లక్ష్మణ్ లింగన్న రాజన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.