యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫిబ్రవరి 5 నుండి 25వ తేదీ వరకు గ్రామ గ్రామాన జరిగే ఇంటింటికి సీపీఎం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు. శనివారం పత్రిక మిత్రుల సమావేశంలో వారు మాట్లాడుతూ. జిల్లావ్యాప్తంగా గ్రామాలలో అనేక స్థానిక సమస్యలు పేరుకుపోయాయన్నారు. జిల్లాలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి లేక నాణ్యమైన వైద్యానికి జిల్లా ప్రజలు దూరమైనారని తెలిపారు, జిల్లాలో మూసి కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బ తినడం, చిన్న నీటి కాలువలైన పిల్లాయిపళ్లి, బునాదిగాని బొల్లెపల్లి కాలువల పనులు పూర్తికాక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి అమలు గాక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సీపీఎం పార్టీగా అనేక పోరాటాలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించకుండా ఉండడం వల్ల ప్రజా సమస్యలు మరింత పెరిగాయన్నారు. ఇప్పటికీ గ్రామాలలో ప్రభుత్వ పథకాలు నోచుకోని అనేకమంది అర్హులు ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు మాసాలు గడుస్తున్న ఒకటి రెండు హామీలు అమలవుతున్నప్పటికీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని హామీలు అమలు చేసే విధంగా ప్రభుత్వ పరిపాలన ఉండాలన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కర్తవ్యంతో సీపీఎం ఫిబ్రవరి 5 నుండి 25 వరకు ఇంటింటికి సీపీఎం కార్యక్రమం నిర్వహించి ఉద్యమ విరాళాల సేకరిస్తూందన్నారు. సమస్యల అధ్యయనం చేయాలని తెలిపారు. ఈకార్యక్రమానికి పూనుకుందని వారు తెలిపారు. వీరితోపాటు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మంగ నరసింహులు, మాటూరు బాలరాజు, కల్లూరు మల్లేశం, దోనూరి నర్సిరెడ్డి, దాసరి పాండు, మేక అశోక్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.