నవతెలంగాణ – భువనగిరి.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి శాసనసభ నియోజకవర్గానికి సిపిఎం పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ప్రకటించింది రెండు మూడు రోజులలో అభ్యర్థి పేరు ప్రకటించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర కమిటీలో పూర్తిస్థాయిలో జిల్లా కమిటీతో పలు దఫాలుగా గా చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో బిజెపిని ఆ పార్టీ అంతర్గతంగా అవగాహన కుదుర్చుకున్న టిఆర్ఎస్ ను ఓడించాలని లక్ష్యంతో సిపిఎం కాంగ్రెస్తో ఈ అసెంబ్లీ ఎన్నికలలో అవగాహన కుదుర్చుకోవడానికి మంతనాలు జరిపారు. కాంగ్రెస్ సరైన సమాధానం రాకపోవడంతో బుధవారం నాడు సాయంత్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి గురువారం మూడు గంటల వరకు గడువు సమయం విధించారు. కాంగ్రెస్ పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వకపోవడంతో 24 స్థానాలకు పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో 17 పోటీ చేసే స్థానాలను ప్రకటించారు. మిగతా ఏడు స్థానాలను రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ప్రకటించిన పోటీ చేసే స్థానాల్లో భువనగిరి నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గంలో సిపిఎం కు పటిష్టమైన కార్యకర్తలు సానుభూతిపరులు ఉన్నారు. ప్రస్తుతం భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలో నువ్వా నేనా అన్న చందంగా పోటీ నెలకొని ఉంది. ఈ తరహాలో కాంగ్రెస్కు సిపిఎం దూరం కావడంతో కాంగ్రెస్ వెనుకబడి అవకాశం ఉంది.