ముంపు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఎం నాయకుల డిమాండ్

నవతెలంగాణ- కంటేశ్వర్ 

ముంపు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన అనేక కాలనీలో పేదల ఇళ్లల్లోకి నీరు రావటంతో సీపీఎం పార్టీ బృందం పేదల ఇండ్లలో సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎడతెరిపి లేని వర్షాల వలన అనేకమంది నిరుపేదల ఇండ్లలోకి నీళ్లు చేరటంతో పేదలు కనీసం కూర్చోవడానికి కూడా వీలు లేకుండా మొత్తం సరుకులు తడిసిపోయాయని తినడానికి వీలు లేకుండా పసిపిల్లలను పట్టుకుని కాలం వెలుగుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ వర్షాల వలన ఇండ్లలోకి నీరు చేరిన పేదల కుటుంబాలకు ప్రభుత్వం 25 కిలోల బియ్యం 5000 రూపాయలు తక్షణ సాయం అందించడంతోపాటు వారికి ప్రత్యామ్నాయ వసతి సౌకర్యాన్ని కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పేదల సొంత ఇండ్లు లేకపోవడంతో పాటు అద్దె ఇండ్లలోనే అనేక కష్టాలు పడుతున్నారని సదుపాయాలు లేకపోవటంతో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారిని ఆదుకోవటానికి ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్. ఏం గోవర్ధన్ జిల్లా కమిటీ సభ్యులు సుజాత నగర కమిటీ సభ్యులు రహమత్ తదితరులతోపాటు సిపిఎం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.