బీజేపీ కార్పొరేట్ మతతత్వ విధానాలను ప్రతిఘటిద్దాం: సీపీఎం

నవతెలంగాణ – హలియా

కేంద్ర బీజేపీ కార్పొరేట్ మత్స్సత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ ప్రకటించాలని సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుల జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే 125 దేశాల్లో ఆకలిలో భారత్ 11 స్థానంలో ఉందని మానవాభివృద్ధిలో 191 దేశాల్లో ఇండియా 137 స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తపరిచారు.బీజేపీ నరేంద్ర మోడీ విధానాల వల్ల కార్పొరేట్ సంస్థల లాభాలు గరిష్ట స్థాయికి చేరాయని పేదల వాస్తవ ఆదాయం 11 శాతానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తపరిచారు. ప్రభుత్వ రంగ సంస్థలు సహజ వనారులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల పరం చేస్తుందని ఊహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వ సంస్థల్లో 100% వాటాలు తెగ నమ్ముతున్నదని ఆవేదన వ్యక్తపరిచారు. 2014లో స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు రైతుల పండించిన పంటకు ఎంఎస్పి చెల్లిస్తానని హామీని బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకో లేదన్నారు.అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ఏసీ 2 ప్లస్ 50% ఉండేలా చట్టబద్ధత కల్పించాలన్నారు. భారత రాజ్యాంగాన్ని అందులో పొందుపరిచిన లౌకికవాదాన్ని తార్మాలు చేస్తూ హిందూ రాజ్య స్థాపన లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ తన యజెండాను ముందుకు తీసుకెళ్తుందని నిరుద్యోగం ధరల పెరుగుదలకు పేదరికం ఆకలి మొదలైన కీలక అంశాలను ప్రజల దృష్టి నుండి మరణించడానికి ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని మతతత్వ శక్తులు ప్రయత్నిస్తున్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ఎందరో ప్రాణత్యాగాలు చేసే సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని రూపుమాపి 12 గంటలు 14 గంటలు చేసే విధంగా చట్టాలు తీసుకొస్తుంది అన్నారు 44 కార్మిక చట్టాలని నాలుగు కోట్లుగా గురించి కార్మికుల శ్రమ దోపిడీ చేస్తూ కార్పొరేట్ సంస్థలకి కొమ్ముగాస్తుందని ఆవేదన వ్యక్తపరిచారు. ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండ్రెడ్డి నాగిరెడ్డి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శీను నాయకులు ఎస్కే బషీర్ కొత్త శ్రీనివాస్ రెడ్డి దుబ్బా రామచంద్రయ్య కందుకూరు కోటేష్ వనమాల కామేశ్వర్ కోమల గురవయ్య బొడ్డు లింగయ్య చిలుముల దుర్గయ్య రేవల్లి వెంకటేశ్వర్లు ఎస్కే చాంద్ పాషా తదితరులు ఉన్నారు.