ప్రాణాపాయ సమయంలో ప్రాణాలు కాపాడటంలో సి పి ఆర్ కీలకం

* జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
* రోడ్ సేఫ్టీ విలేజ్ కమిటీలో భాగంగా ప్రతి గ్రామంలో శిక్షణ…
* ప్రమాదం జరిగిన వ్యక్తికి వెంటనే ప్రథమ చికిత్స అందించడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలి…
నవతెలంగాణ సిరిసిల్ల
ప్రాణాపాయ సమయంలో ప్రాణాలు కాపాడటంలో సిపిఆర్ కీలకం అని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ విలేజ్ కమిటీలో భాగంగా  ప్రధాన రహదారులకు అనుకోని ఉన్న దుకాణాలు,హోటల్‌లు,పంక్చర్ షాప్, పెట్రోల్ పంపులు నడిపే వారికి సిపిఆర్, ప్రథమ చికిత్స శిక్షణ,కిట్స్ పంపిణి కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని మాట్లాడుతూ ప్రమాధాలు జరిగిన సందర్భాల్లో మొదటి సారిగా స్పందిచేది ఆ పరిసరాల్లో ఉన్న వివిధ షాప్ లలో ఉన్న వారికి సి పి ఆర్, ప్రథమ చికిత్సలపై అవగాహన ఉంటే చాలా వరకు ప్రాణాలు కాపడవచ్చు అనే ఉద్దేశ్యంతో రోడ్ సేఫ్టీ విలేజ్ కమిటీలో భాగంగా జిల్లాలోని రహదారులకు ఆనుకుని ఉన్న దుకాణాలు,హోటల్‌లు,పంక్చర్ షాప్,పెట్రోల్ పంపులు  నడుపుతున్న పౌరులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
ప్రస్తుత రోజుల్లో ప్రమాధాలు జరిగిన సందర్భాల్లో ప్రథమ చికిత్స సమయానికి అందక చాలా మంది మరణిస్తున్నరని,ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు గోల్డెన్ అవర్ ఉంటుంది అని ఆ గోల్డెన్ అవర్(గంట) సమయంలో సాధ్యమైనంత వరకు కష్టపడి ఆ వ్యక్తిని బతికించవచ్చని తెలిపారు.ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించడం,హాస్పిటల్ కి తరలించి వారి ప్రాణాలు కాపాడడం ముఖ్యమని తెలిపారు. సోషల్ మీడియాలో చూసి ప్రమాధాలు జరిగినప్పుడు సీపీఆర్, ప్రథమ చికిత్స చేస్తున్నారని అన్నారు.  ప్రతి పోలిస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో సి పి ఆర్, ప్రథమ చికిత్స  శిక్షణ ఇవ్వడం జరుగుతుదని ఎస్పీ  తెలిపారు. రోడ్ ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలు కాపాడిన వ్యక్తులకి అవార్డ్స్ మరియు రివార్డ్స్ అందించడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాధాలు జరిగిన సమయాల్లో, స్పృహ తప్పి పడిపోయిన సందర్భంగా ల్లో , ఎండ దెబ్బ తగిలిన సందగర్బాల్లో,పాము కాటుకు గురైన సందర్బాలో, గుండె పోటు వచ్చిన సందర్బాలో ఎలాంటి ప్రథమ చికిత్సలు అందించాలని  వైద్య నిపుణులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ వసంత్ కుమార్, సి ఐ లు కృష్ణ, మొగిలి,శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, ఆర్.ఐ లు యాదగిరి, మధుకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.