నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డికి సీఎం ముఖ్య ప్రజా సంబంధాల అధికారి బి.అయోధ్యరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ఈ మేరకు హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో ఆయన్ను కలిశారు. సీఎంకు పూలగుచ్ఛం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని చెప్పారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.