సీపీఎస్‌ రద్దు చేయాలి

– స్పీకర్‌కు సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీంను రద్దు చేయాలని సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కోరింది. ఈ మేరకు ఆదివారం యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ, కోశాధికారి నరేష్‌ గౌడ్‌, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు నరేందర్‌ రావు శాసనసభా స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని వారు కోరారు. సీఎం దృష్టికి తీసుకెళ్తానని స్పీకర్‌ హామీ ఇచ్చినట్టు నాయకులు తెలిపారు.