– డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కక్కర్ల కృష్ణమూర్తి
నవతెలంగాణ నెల్లికుదురు
సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిటిహెచ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కక్కెర రామ్మూర్తి ప్రభుత్వ డిమాండ్ చేసినట్లు తెలిపారు గురువారం సెప్టెంబర్ 1వ తేదీన జిల్లా కేంద్రంలో జేఏసీ రక్షణ కలెక్టరేట్ ముందు అన్ని సంఘాలతో నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ డిటిఎఫ్ సభ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా సిపిఎస్ ను రద్దుచేసి దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి సెప్టెంబర్ ఒకటో తేదీన జిల్లా కేంద్రాల్లో జేఏసీ పక్షాన జిల్లా కలెక్టరేట్ మందట అన్ని సంఘాలతో కలిసి నిరసన ప్రదర్శనను విజయవంతం చేయాలి డి టి ఎఫ్ సభ్యత్వ ప్రచారంలో భాగంగా నెల్లికుదురు మండలం వివిధ పాఠశాలలు సందర్శించి ఉపాధ్యాయులను డిటిఎఫ్ లో సభ్యులుగా చేర్పించడం నిర్వహిస్తున్నామని అన్నారు ఇటీవల ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ పెండింగ్లో ఉన్న రెండు డి ఈ లను విడుదల చేసి పిఆర్సి కమిటీ నివేదిక తెప్పించి మంచి ఫిట్మెంట్తో అమలు చేయాలని కోరారు. అలాగే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పదోన్నతులలో తీవ్ర అన్యాయం జరిగిన సందర్భంలో గత ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు పదివేల ప్రాథమిక ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరీ చేయాలి .పిఆర్సి కమిటీ నివేదికను తెప్పించుకొని మంచి ఫిట్మెంట్ తో అమలు చేయాలని. స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్ గా పదోన్నతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిలర్ యాదగిరి మరియు మండల అధ్యక్షులు ఎం రాజు మరియు వెంకన్న రాజశేఖర్ రాగి రమేష్ సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు