– రాష్ట్ర స్థాయి సదస్సును విజయవంతం చేద్దాం
– టీఎస్ యూటీఎఫ్, జేఎఫ్‌ఆర్‌ఓపీఎస్ రంగారెడ్డి జిల్లా కమిటీ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్దరించాలని టీఎస్‌యూటీఎఫ్, జేఎఫ్‌ఆర్‌ఓపీఎస్ రంగారెడ్డి జిల్లా కమి టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శుక్రవారం టీఎస్‌యూ టీఎఫ్, జేఎఫ్‌ఆర్‌ఓపీఎస్ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ‘ఛలో హైదరా బాద్’ పోస్టర్‌ను ఆవిష్కరించింది. 30, 40 ఏండ్లుగా ప్రభు త్వ ఉద్యోగం చేసి సర్వీస్ అందించిన ఉద్యోగి రిటైర్ అయి నా తరువాత పెన్షన్‌కు నోచుకోవడం లేదనని కమిటీ ఆవే దన వ్యక్తం చేసింది. చివరి దశలో ఆర్థిక ఇబ్బందులకు గురై మానసికంగా, శారీరకంగా కృంగి పోయి ఎన్నో ఇబ్బందు లకు గురైయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రతి ఉద్యోగికీ పెన్షన్ గ్యారంటీ ఇవ్వగలిగిన ఓపీఎస్‌ను పునరుద్దరించాల ని డిమాండ్ చేసింది. పెన్షన్ పొందడం ప్రతీ ఉద్యోగి హ క్కు అని సుప్రీంకోర్ట్ చెప్పినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెడ చెవినా పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కార్య క్రమంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు గాలయ్య, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కే.గోపాల్ నాయక్, ప్రధాన కా ర్యదర్శి ఎం.వెంకటప్ప, రాష్ట్ర కమిటీ సభ్యులు బింగి రాము లయ్య, జిల్లా కోశాధికారి పి.జగన్నాథ్, జిల్లా కార్యదర్శి బి.భువనేశ్వరి, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, కలెక్టరేట్‌లో పనిచేస్తున్న సీపీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.