సీపీఎస్‌ రద్దు చేసి యూపీఎస్‌ పునరుద్ధరించాలి

– టీఎస్‌యూటీఎఫ్‌ డిమాండ్‌
నవతెలంగాణ-శంషాబాద్‌
ఎన్‌ఈపీ, ఎన్‌పీఎస్‌ (సీపీఎస్‌) రద్దుచేసి, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం శంషాబాద్‌ జిల్లా పరిషత్‌ (బాలికల) ఉన్నత పాఠశాలలో సంఘం ఆధ్వర్యంలో గోడప త్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి భువనేశ్వరి మాట్లాడుతూ ఈ నెల 18, 19వ తేదీలలో మండల స్థాయిలో బైక్‌ ర్యాలీలు, ఆగస్టు 12న ర్యాలీలు, ధర్నాలు, ఆగస్టు మూడో వారంలో జిల్లా స్థాయి లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, హైదరాబాద్‌లో సెప్టెం బర్‌ 1న మహాధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాల ని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ-3 ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానం వర్తింప చేయాలని, ఐటీ మినహాయింపు పరిమితి పెంచాలని కోరారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయాల న్నారు. విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించా లని కోరుతూ కార్యక్రమాలు నిర్వహించబోతు న్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల (బాలికలు) హెచ్‌ఎం ఉమామహేశ్వ రి, మండల ప్రధాన కార్యదర్శి సురేశ్‌, శ్రీను, నర్సింగ్‌రావు, శ్రీశైలం, లోక్యనాయక్‌, మండలంలోని మహిళ ఉపాధ్యాయురాళ్లుపాల్గొన్నారు.