కుట్రలను ఛేదించి…కేసులను అధిగమించి

– మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
దశాబ్దాలుగా అన్యాయానికి, వివక్షకు గురైన పాలమూరుకు కృష్ణమ్మ పరుగుపరుగున రానున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడిం చారు. ఈమేరకు గురువారం ఆయన ట్వీట్‌ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను సాధించడం వెనుక సీఎం కేసీఆర్‌ కృషి, పట్టుదల ఉందనీ, మరో అపూర్వ, చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. ఆయన మొక్కవోని దీక్షకు ప్రభుత్వం పట్టువిడవని ప్రయత్నం తోడై సాధించిన ఫలితమని గుర్తు చేశారు. పాలమూరు బిడ్డల దశాబ్దాల కల సాకారమైన ఈ సందర్భాన్ని మాటల్లో వర్ణించలేని మధుర ఘట్టమని వ్యాఖ్యానించారు. పాలమూరు బీళ్లు దాహార్తిని తీర్చే ప్రజల తలరాతను మార్చే ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడం అపూర్వ ఆనందాన్ని ఇస్తున్నదని వివరించారు.