– నాసిరకంగా గ్రామపంచాయతీ నిర్మాణం
నవతెలంగాణ-తాండూరు రూరల్
కేంద్ర ప్రభుత్వం తాండూరు మండలాన్ని ఐదేండ్ల కింద రూబ్బన్ పథకం కింద ఎన్నిక చేసిం ది. గ్రామాల్లో పట్టణాల సౌకర్యాలు కల్పించాలని ముఖ్యఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. తాం డూరు మండలానికి రూ.30 కోట్ల నిధులు మం జూరు చేశారు. ఇందులో మీసేవ, బస్ షెల్టర్, సోలార్ లైట్లు, సీసీరోడ్లు, గ్రామపంచాయతీ భవ నాల, నిర్మాణం కోసం నిధులు కేటాయించారు. పనులు చేసిన కాంట్రాక్టర్లు, నాసిరకంగా నిర్మిం చడంతో ప్రారంభానికి ముందే పగుళ్లు వచ్చాయి. ఒక్కొక్క పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. కాంట్రాక్టర్లు మాత్రం పనులను నాసిరకంగా చేసి చేతులు దులు పుకున్నారు. మరోవైపు చేసిన పనులకు డబ్బులు రాలేదని సాకులు చెప్తున్నారు. ఏది ఏమైనా పని నిర్మాణంలో నాణ్యత పాటించాలని, అధికారులు చెప్పినా పట్టించుకోకపోవడం వల్ల, నిర్మించిన సంవత్సరంలోపే, పగుళ్లు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. దీనికి నిదర్శనం తాండూరు మండలం, అంతారం తండాలో నిర్మించిన నూతన, గ్రామపంచాయతీ భవనమే, పనులు పూర్తిచేసి గత నెల, ప్రారం భించారు. కార్యక్రమానికి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు. పంచాయతీ భవనంలో పనులు నాసిరకంగా ఉండడంతో అధికారులకు, పనులు మొత్తం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా ఆ పని ఇంకా అలాగే మిగిలిపోయింది, భవనం ప్రారంభించి నెల రోజులు దాటినా ఆ భవనంలో ఇంకా విద్యుత్ కనెక్షన్ లేదు. సరిపోను కలర్ వేయలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికా రులు కాంట్రాక్టర్ చొరవ తీసుకొని పంచాయతీ భవనంలో పనులు, పూర్తిచేయాలని తండావా సులు కోరుతున్నారు.