శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో భారీగా నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తెలుగు, తమిళంలో గ్రాండ్‌గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ గురువారం ఆరంభమైంది. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తన పాపులర్ స్టొరీ టెల్లింగ్ స్టయిల్‌లో, యూనిక్ సెట్టింగ్‌తో హై యాక్షన్-ప్యాక్డ్ అనుభూతిని అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. శివకార్తికేయన్ ఇంతకు ముందు చూసినట్లుగా కాకుండా పూర్తిగా ప్రత్యేకమైన, స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తారు. కన్నడ నటి రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో కథానాయికగా నటించనున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.