నిర్మాణ, డిస్ట్రిబ్యుషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, ఛారు బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి కన్నడ బ్లాక్ బస్టర్ ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’ను తెలుగులో ‘బాయ్సు హాస్టల్” పేరుతో విడుదల చేస్తున్నారు. నితిన్ కష్ణమూర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఇందులో ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ ప్రధాన పాత్రలు పోషించగా, రిషబ్ శెట్టి, పవన్‌కుమార్, షైన్ శెట్టి, రష్మీగౌతమ్, తరుణ్ భాస్కర్ అతిథి పాత్రల్లో నటించారు.
‘బేబీ’ టీమ్ ‘బాయ్సు హాస్టల్’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది.ఈ సినిమా ఈనెల 26న విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత శరత్ మాట్లాడుతూ,’ఈ సినిమా చూసినప్పుడు ప్రారంభం నుంచి చివరి వరకూ నవ్వుతూనే ఉన్నాను. ఇదొక క్రేజీ జోనర్ ఫిల్మ్. సినిమా బ్రిలియంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కన్నడలో చూసిన వాళ్ళకి కూడా తెలుగులో చూస్తే కొత్త అనుభూతిని ఇస్తుంది’ అని తెలిపారు. ‘దాదాపు 500 మంది కొత్త థియేటర్ ఆర్టిస్ట్‌లతో ఈ సినిమాని క్రియేట్ చేశారు. ఇది మ్యాడ్ ఫిల్మ్’ అని మరో నిర్మాత అనురాగ్ రెడ్డి చెప్పారు. సుప్రియ మాట్లాడుతూ, ‘ట్రైలర్ చూశాను. చాలా ఫన్, ఎనర్జిటిక్‌గా ఉంది. అప్పుడే ఈ సినిమాని తెలుగులో విడుదల చేయాలని భావించాం’ అని అన్నారు.