ఎన్నో రకాల ఫ్రిడ్జ్ మోడల్స్‌ని చూసి ఉంటారు. కానీ ఇలాంటి వెరైటీ ఫ్రిడ్జ్ గురించి విని ఉండరు. ఈ ఫ్రిడ్జ్ ఎలక్ట్రిసిటీ అవసరం లేకుండా పని చేస్తుంది. మన సంప్రదాయ మూలాలకు సంబంధించిన మోడ్రన్ వర్షనే ఈ ఫ్రిడ్జ్ అని చెప్పొచ్చు. మరి ఇంతకీ ఇదెలా ఉంటుందంటే…
ఈ గ్రౌండ్ ఫ్రిడ్జ్‌ని డచ్‌కి చెందిన డిజైనర్ ఫ్లోరిస్ షూండర్‌బీక్ రూపొందించారు. ఇది చూడటానికి గోళాకారంలో ఉండి చెక్కతో కూడిన మెట్ల ద్వారం ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే ఫాలిక్ ఆకృతిలో ఉంటుంది. ఇది ఆధునిక గృహౌపకరణాలకు అత్యంత విభిన్నంగా ఉంటుంది. సుమారు మూడు వేల లీటర్లు ఉండే ఈ ఫ్రిడ్జ్‌లో దాదాపు 12 ఫ్రిడ్జ్‌లలో పట్టేంత ఆహార పదార్థాలు పెట్టొచ్చు.
ఈ ఫ్రిడ్జ్‌ని భూమిలో సుమారు 1 నుంచి 1.5 మీటర్ల లోతులో పెట్టి చుట్టూ మట్టిని కప్పేస్తారు. అక్కడ ఉష్ణోగ్రత సుమారుగా 10 నుంచి 12 డిగ్రీల సెంటీగ్రేడ్‌లు ఉంటుంది. అక్కడ చుట్టూ ఉన్న మట్టి నేచురల్ ఇన్సులేటర్‌గా పని చేసి ఫ్రిడ్జ్ లోపల చల్లదనాన్ని క్రియేట్ చేస్తుంది. అలాగే దానిలోపల వేడిని కింద ఉన్న భూమి అబ్జర్వ్ చేసుకుని బయటకు వదులుతుంది. అందువల్ల అక్కడ ఎల్లప్పుడూ ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. అలాగే రాత్రి సమయాల్లో ఎయిర్ ఎక్స్‌ఛేంజ్ అయ్యి కూల్ ఎయిర్ వచ్చేందుకు టైమర్‌తో కూడిన ఒక ఫ్యాన్ ఫిక్స్ చేసి ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్‌ని ఇన్‌స్టాల్ చేసుకునేందుకు ఎలాంటి పర్మిషన్లు అవసరం లేదు.