తక్షణమే వల్నరబిలిటీ  మ్యాపింగ్ ను రూపొందించాలని

 – ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు కృషి చేయాలి 
– అదనపు కలెక్టర్ శ్రీనివాస్
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ :పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సెక్టోరల్ అధికారులు తక్షణమే వారికి కేటాయించిన సెక్టర్ కు సంబంధించిన వల్నరబిలిటీ  మ్యాపింగ్ ను రూపొందించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు. శనివారం జిల్లా  కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో సెక్టోరల్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సెక్టోరియల్ అధికారులు వారి సెక్టార్ కు కేటాయించిన  పోలీసు అధికారులతో కలిసి సంయుక్తంగా వారి సెక్టార్ ను సందర్శించి మంగళవారం లోపు  వల్నరబిలిటీ మ్యాపింగ్  పంపించాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛ వాతావరణం లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడంలో సెక్టోరల్ అధికారులు కృషి చేయాలని అన్నారు. ఇందుకు వారు సమర్పించే వల్నరబులిటీ మ్యాపింగ్ అత్యంత ముఖ్యమని అన్నారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రాములు నాయక్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, ఆర్డీవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.