సాటాపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గానికి సన్మానం

నవతెలంగాణ – రెంజల్

జనవరి 31న సర్పంచుల పదవీకాలం పూర్తి కావడంతో గురువారం గ్రామ సర్పంచ్ ఏకార్ పాషా, పాలకవర్గ సభ్యులకు కార్యదర్శి మహబూబ్ అలీ పూలమాలలను వేసి శాలువా తో ఘనంగా సన్మానం జరిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీడిఓ శంకర్, ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్, సూపర్డెంట్ శ్రీనివాస్, ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లతా సాయిలు, పాలకవర్గ సభ్యులు కంఠం గంగారాం, శ్రీకాంత్, గుర్రాల సంతోష్, కాజా ఖురేషి, ఇర్ఫానా బేగం, పల్లెపు సత్తెమ్మ, అంకం పోసాని, తాహెరా బేగం, లంబాడి హన్ను, ఎండి జమీర్, గుర్రాల గంగమని, షేక్ హైమద్, కోఆప్షన్ సభ్యులు రాణి చంద్రశేఖర్, జమున బి, గ్రామ కార్యదర్శి మహబూబ్ అలీ, కారోబార్ మంగురాం, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.