
తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజీ క్రికెట్ మెన్ టోర్నమెంట్ హోరా హోరీగా కొనసాగుతుంది. నాల్గవ రోజు మొదటి మ్యాచ్ వర్సిటీ పి. జి. టిమ్ తో తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ టీం తలపడగ 12 ఓవర్లలో 104 పరుగులు సాధించి వర్సిటీ పి జి టీం గెలుపొందింది.రెండవ మ్యాచ్ మొదటి సెమీ ఫైనల్ గిరిరాజ్ డిగ్రీ కళాశాల మరియు కేర్ డిగ్రీ కళాశాల తలపడగా 15 ఓవర్ల లో 145 పరుగులు సాధించి గిరిరాజ్ డిగ్రీ కళాశాల గెలుపొంది ఫైనల్స్ కు చేరుకుందని వర్సిటీ డైరెక్టర్ స్పోర్ట్స్ డాక్టర్. జి. బాలకిషన్ తెలిపారు.ఈ టోర్నమెంట్ లో ఆర్గనైసింగ్ సెక్రటరీ డాక్టర్. బి. ఆర్. నేత, జూనియర్ అసిస్టెంట్ నరేష్, క్రీడాకారులు పాల్గొన్నారు.