నవతెలంగాణ-బెజ్జంకి: మండల కేంద్రంలో బెజ్జంకి క్రికెట్ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించనున్న క్రికెట్ టోర్నీని మంగళవారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించనున్నట్టు నిర్వహాకుడు జేరిపోతుల మధు తెలిపారు. అదివారం మానసా దేవి ఆలయం వద్ద ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను క్రికెట్ అసోసియేషన్ సభ్యులు మార్యాదపూర్వకంగా కలిసి క్రికెట్ టోర్నీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించినట్టు జేరిపోతుల మధు తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు మధు సూదన్ రెడ్డి, నిర్వహాకులు తదితరులు పాల్గొన్నారు.