ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ఆదివారం మండలంలోని మైలారం గ్రామం శివారులో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడల వల్ల స్నేహ సంబంధాలు పెరుగుతాయని తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోయిన వారు నిరుత్సాహపడకుండా మళ్లీ గెలిచేందుకు కృషి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించడానికి జిల్లా స్థాయి టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, లేతకుల మధుకర్ రెడ్డి, ఉప్పుగల్ల శ్రీనివాస్, పరుపాటి రాజిరెడ్డి, క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.