నవతెలంగాణ – భీంగల్
పట్టణ కేంద్రంలోని బొర్ర హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో వేముల మంజులమ్మ, చెప్పాలా రామకృష్ణ స్మారక క్రికెట్ టోర్నమెంట్లను జెడ్పిటిసి చౌటుపల్లి రవి, ఎంపీపీ మహేష్, మండల అధ్యక్షుడు నరసయ్య , కౌన్సిలర్ సిహెచ్ గంగాధర్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటలతో వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారుల మధ్య స్నేహం పెరుగుతుందని , క్రీడాకారులు టోర్నిలో పాల్గొని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని అన్నారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నాయకులు కన్నె సురేందర్, శర్మ నాయక్ ,మున్సిపల్ కౌన్సిలర్లు బోధిరే నర్సయ్య, సిహెచ్ గంగాధర్, బోర్ లింగం, మల్లెల ప్రసాద్, బొదిరే తిరుపతి, సుమన్, టోర్నమెంట్ నిర్వాహన సభ్యులు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.