సిడ్నీలో మలబార్ గోల్డ్ ప్రారంభించిన క్రికెటర్ బ్రెట్ లీ

నవతెలంగాణ – నిజామాబాద్
సిటీ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాండ్ మొదటి షోరూంను సిడ్నీ నగరంలో ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ బ్రెట్ లీ, మలబార్ గోల్డ్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ షామ్లా లాల్ అహమ్మద్, ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అషర్ ఒ ఫార్, మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపి అహమ్మద్, ఈస్ట్ ఆస్ట్రేలియా రీజినల్ హెడ్ అజిత్ సిడ్నీ లో ప్రారంభించారు అని మలబార్ గోల్డ్ నిజామాబాద్ హెడ్ అక్షయ్ మీడియా తో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో ఆభరణాల షోరూము ఏర్పాటు చేసిన తొలి భారతీయ ఆభరణాల బ్రాండ్ గా చరిత్ర సృష్టించామని, కస్టమైజ్డ్ జ్యువెలరీ డిజైనింగ్ సదుపాయంతో పాటు 18కె, 22కె బంగారం, డైమండ్ విలువైన రత్నాల ఆభరణాల విస్తృతమైన సేకరణలు అందుబాటులో ఉంటాయని, ప్రపంచ వ్యాప్తంగా 6వ అతి పెద్ద జ్యువెలరీ రిటైలర్ గా పేరుగాంచిన మలబార్ గోల్డ్ అని, 13వ దేశంలో మలబార్ కార్యకలాపాలను విస్తరించిందని, భారతదేశం, యుఎఇ, ఖతార్, కువైట్, ఒమన్, కెఎస్ఎ, బహ్రెయిన్, సింగపూర్, మలేషియా, యుఎస్ఎ, యుకె, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో 340కి పైగా షోరూములతో విస్తృతమైన రిటైల్ ఆభరణాల వ్యాపార సంస్థగా బలమైన ఉనికిని కలిగి ఉన్నామని అన్నారు. సంస్థ సాధించిన నికర లాభాలలో 5 శాతం మొత్తాన్ని ఆరోగ్యం, ఆకలి లేని ప్రపంచం, గృహనిర్మాణం, విద్య, మహిళా సాధికారత, పర్యావరణం వంటి అంశాల్లో కీలక దృష్టి కేంద్రీకరించబడి సామాజిక స్పృహ కలిగిన బాధ్యతాయుతమైన సంస్థగా ఉండటానికి, సంస్థ లక్ష్యాలను బలోపేతం చేస్తున్నామని అన్నారు.