ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానం పాటించాలి 

Crimilayer system should be followed in SC reservations– దళిత వికాస సమితి రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు

నవతెలంగాణ –  కామారెడ్డి 
ఎస్సీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్ తప్పనిసరి ఉండాలంటూ పార్లమెంటులో చట్టం చేయాలని దళిత వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు కిన్నర సిద్దార్థ్ అన్నారు. దళిత సమన్యాయం ఆధ్వర్యంలో చేపడుతున్న పాదయాత్ర బుదవారం కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో  ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్లో ప్రారంభమైన ఈ పాదయాత్ర 40 రోజుల పాటు కొనసాగుతూ క్రిమిలేయర్ పై లాభనష్టాల గురించి వివరిస్తూ యాత్ర కొనసాగుతుందన్నారు. గద్వాల జిల్లా అలంపూర్లో ముగుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దళిత వికాస సమితి ప్రతినిధులు లింగం, బాలరాజు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.