నవతెలంగాణ డిచ్ పల్లి: ఆపరేషన్ స్మైల్ – ఎక్స్ లో బాగంగా ఆపరేషన్ స్మైల్ టీం సభ్యులు ఇందల్ వాయి మండల కేంద్రంలో ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి 01 నుండి 31 వరకు నిజామాబాద్ కమినరేట్ పరిధిలో గల నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో 18 ఎళ్ళ లోపు తప్పిపోయిన, వదిలి వేసిన కార్మికులు ఉన్నట్లైతే అలాంటి వారి సమాచారం సేకరించి, రక్షించి వారి తల్లదండ్రులకు అప్పగిస్తామని, బలవంతంగా బిక్షటన, వెట్టి చాకిరి చేయించిన వారిపై తగిన క్రిమినల్ కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఇంఛార్జి ఎస్సై స్రవంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్ ప్రభుదాస్, హెల్త్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ శంకర్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ బాబూ రావు, కానిస్టేబుల్స్ నాగరాజ్, హరిత రాణి పాల్గొన్నారు. ఇందల్ వాయి స్టేషన్లో విజయ్ సింగ్ కొడుకును పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. హోటల్లో పనిచేయడానికి వీల్లేదని ఎస్ఐ స్రవంతి పేర్కొన్నారు.ఇలాగే ఉంటే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.