– పరిగణించడంతో వ్యవస్థపై భారం : బాంబే హైకోర్టు
ముంబయి :లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) ప్రకారం శంగార సంబంధాలను (రొమాంటిక్ రిలేషన్‌షిప్స్) నేరంగా పరిగణించడంతో న్యాయ వ్యవస్థపై భారం పడిందని బాంబే హైకోర్టు తెలిపింది. 2016లో బాలికపై లైంగికదాడి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ న్యాయమూర్తి జస్టిస్ భారతి డాంగ్రే ఈ వ్యాఖ్య చేశారు. నేరం జరిగినప్పుడు ఆ వ్యక్తి వయస్సు 25 సంవత్సరాలు మరియు బాలిక వయస్సు 17 సంవత్సరాల 5 నెలలు. తమ మధ్య అంగీకార సంబంధమే ఉన్నదని బాలిక తెలిపింది. ట్రయల్ కోర్టు 2019 ఫిబ్రవరిలో పోక్సో చట్టం కింద వ్యక్తిని దోషిగా నిర్ధారించి, ఆ వ్యక్తికి పదేండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. జులై 10న హైకోర్టు ఈ ఉత్తర్వులను కొట్టివేసింది. పోక్సో చట్టం ప్రకారం 17 సంవత్సరాల 364 రోజుల వయస్సు గల బాలికతో ఏకాభిప్రాయంతో లైంగిక చర్యలో పాల్గొన్నందుకు 20 ఏండ్ల యువకుడిని దోషిగా నిర్ధారించవచ్చని న్యాయమూర్తి తెలిపారు. ”శంగార సంబంధాన్ని నేరపూరితం చేయడం వల్ల న్యాయవ్యవస్థ, పోలీసు, పిల్లల రక్షణ వ్యవస్థ గణనీయమైన సమయాన్ని వినియోగించడం ద్వారా నేర న్యాయ వ్యవస్థపై భారం పడుతున్నది” అని కోర్టు వివరించింది.