చైల్డ్ ఆర్టిస్ట్‌గా, తర్వాత హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు తనీష్. ‘నచ్చావులే’ సినిమాతో హీరోగా అందర్నీ ఆకట్టుకున్న ఆయన పలు చిత్రాల్లోని భిన్న పాత్రలతో మెప్పించారు. ఆ తర్వాత ప్రతినాయకుడిగానూ నటించించారు.
అయితే కొద్దిరోజులుగా నటనకు దూరంగా ఉంటున్నప్పటికీ మధ్యలో బిగ్ బాస్ సీజన్2లో టాప్ 5 కంటెస్టెంట్‌గా మెరిసిన తనీష్ ఇప్పుడు సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నేడు(గురువారం) తనీష్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన కిశోర్‌వర్మ దర్శకత్వంలో నటిస్తున్న ‘క్రిమినల్’ మూవీ ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో తనీష్ కొత్తగా కనిపించడంతోపాటు ఒక్క పోస్టర్‌లోనే రెండు వేరియేషన్స్‌తో డిఫరెంట్‌గానూ ఉన్నారు. క్రియేటివ్ ఫ్రెండ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్ర విశేషాలను త్వరలోనే తెలియచేస్తామని చిత్ర బందం పేర్కొంది.