చర్చిపై దాడికేసులో నేరస్తుల అరెస్ట్

నవతెలంగాణ –  కామారెడ్డి
గూడెం గ్రామంలో ప్రార్ధనల కొరకు నూతనంగా నిర్మించిన చర్చి రేకుల షెడ్డు లపై జైశ్రీరామ్, జై హనుమాన్ అంటూ మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఇష్టం వచ్చినట్లు వ్రాతలు వ్రాసి, చర్చిని ధ్వంసం చేసిన విషయంలో కేసు నమోదు చేసి  దేవునిపల్లి ఎస్సై, కామారెడ్డి రూరల్ సీఐ రామన్  త్వరితగతిన కేసు విచారణ చేపట్టి సాక్షులను విచారించి 9 మంది నేరస్తులను పట్టుకొని అరెస్టు చేయడమైనది. ఇక ముందు ఎవరైనా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడినట్లైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పత్రిక ముఖంగా హెచ్చరిస్తున్నాము అని అసిస్టెంట్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ బి చైతన్య రెడ్డి  ఒక ప్రకటనలో తెలిపారు.