దుండగుల్ని కఠినంగా శిక్షించాలి

Criminals should be punished severely– ప్రగశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు వి. సత్తెమ్మ
– జాతీయ రహదారిపై దుండగుల దిష్టిబొమ్మ దహనం 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
వైద్య కళాశాల విద్యార్థినిని అత్యాచారం చేసి, హత్య  చేసిన దుండగుల్ని కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రగశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు వి. సత్తెమ్మ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని 63వ నంబర్ జాతీయ రహదారిపై సిపిఐ (ఎం.ఎల్ )మాస్ లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో దుండగుల దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ సందర్బంగా తెలంగాణ ప్రగతిల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు సత్తెమ్మ మాట్లాడుతూ.. కలకత్తాలో వైద్య కళాశాల విద్యార్థినిపై జరిగిన దారుణమైన  అత్యాచారం, హత్య సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ట్రైని డాక్టర్ పై పాశవికంగా హింసించి, అత్యాచారం చేసి, హత్య చేయడం సిగ్గు చేటు అన్నారు. కేంద్రం ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం దొషుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించాల్సింది పోయి ఒకరిపై ఒకరు నెట్టేసుకోవడం తప్ప మరొకటి చేయడం లేదన్నారు. ప్రధాని మోదీ ఎర్రకోటపై జెండా ఎగరేసి మాట్లాడుతాడు తప్ప.. నేరస్తుల్ని పట్టుకొని ఎన్ కౌంటర్ చేయడం లేదన్నారు. జరిగిన సంఘటనను  రాజకీయంగా వాడుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందే కానీ భాధితుల పక్షాన నిలబడడం లేదని విమర్శించారు. సభ్యసమాజం తలదించుకునేలాగా జరిగిన సంఘటనను మానవత్వం ఉన్న ప్రతిఒక్కరు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. విధుల్లో ఉన్న విద్యార్థినిపై దారుణం జరిగిందని, ప్రస్తుత సమాజంలో విధుల్లో ఉన్నవారికే రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యకళాశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వహించడం శోచనీయమని, సెమినార్ హాల్లో అత్యాచారం జరిగితే కళాశాలలో ఎవరికీ తెలియదు అన్నట్లు వ్యవహరించడం పలు అమానాలకు తావిస్తుందన్నారు. తక్షణమే కేంద్ర, పశ్చిమ బెంగాల్  రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రమాని నిందితులను  కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి న్యాయం చేయాలి డిమాండ్ చేశారు.కార్యక్రమం సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా కమ్మర్ పల్లి మండల కార్యదర్శి బి.అశోక్, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సురేష్, అఖిల భారత ప్రగతి శీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి.కిషన్,  తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్.రమేష్, జిల్లా నాయకులు కే.రాజేశ్వర్, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం మండల అధ్యక్షుడు వి.బాలయ్య, తెలంగాణ ప్రగతిల మహిళా సంఘం కమ్మర్ పల్లి మండల నాయకురాలు వి.రాధక్క, వి.అశోక్, తదితరులు పాల్గొన్నారు.