బిల్లులు చెల్లించలేక..బీఆర్ఎస్ పై విమర్శలు..

Unable to pay bills.. Criticism on BRS..– కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నాయకుడు తిరుపతి అసహనం 
– ప్రభుత్వం రైతాంగాన్ని అణచివేస్తోందని విమర్శ
నవతెలంగాణ – బెజ్జంకి 
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ద్యేయంగా పని చేసి కాళేశ్వరం జలాశయం నిర్మించిందని.. పంపుల ద్వార నీరు ఎత్తిపోసి రైతులకు నీరు అందించలేక..జలాశయం నిర్మాణంలో లోపాలున్నాయని మభ్యపెడుతూ విద్యుత్ బిల్లులు చెల్లించలేని స్థితిలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వముందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కనగండ్ల తిరుపతి శుక్రవారం అసహనం వ్యక్తం చేశారు.రైతులను మభ్యపెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేస్తోందని తిరుపతి విమర్శించారు.ఇప్పటికైనా ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు మానుకుని రైతు భరోసా,రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేసి కాళేశ్వరం జలాశయం నీరును రైతుల పంటల సాగుకు అందించాలని తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.