తిమ్మాపూర్ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు మానుకోవాలి

– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి
నవతెలంగాణ – తొగుట
తిమ్మాపూర్ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ, దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పై విమర్శలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి అన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిన్నటి  టిఆర్ఎస్ నాయకులు, తిమ్మాపూర్ ఎంపీటీసీ  కాంగ్రెస్ పార్టీ, దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పై చేసిన విమర్శలను తీవ్రం గా కండిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో స్పెషల్ డెవలప్మెంట్ నిధులతో ఒక్కో నియోజకవర్గానికి రూ. 10 కోట్ల చొప్పున మొత్తం 1190 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. వాటిని జిల్లా ఇన్చార్జిమంతులకు అప్పగించి ఆయా నియోజకవర్గాల్లో అవసరమైన పనుల పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. జీవో ప్రకారమే దుబ్బాక నియోజకవర్గం లోని వివిధ మండలాలకు అవసర మైన మేర జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ నిధులను మంజూరు చేశారని తెలిపారు. ప్రభు త్వం జీవోలో నిర్దేశించిన ప్రకారం పాఠశాలలు, కళాశాలలలో మౌలిక వసతులను, తాగునీటికి, ప్రభుత్వ కార్యాలయాల మరమ్మత్తులకు నిధులు కేటాయించారని పేర్కొన్నారు. ప్రభుత్వం నిబంధ నల ప్రకారం మౌలిక వసతులు కల్పించేందు నిధు లు కేటాయుస్తే, ప్రభుత్వం నిబంధనల ఉల్లంఘిం చిదనడం అస్యాస్పదం అన్నారు. ముందు ఎంపీ టీసీ అవగాహన పెంచుకొని పూర్తిస్థాయిలో జీవో కాపీలను చదువుకుని మాట్లాడాలని సూచించా రు. దుబ్బాక నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి పనుల కోసం ఎన్నడు నిధులను అడగలేదని ప్రశ్నించారు. ఆనాటి ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే పార్టీ నాయకులతో అనవసరమైన కేసు లు వేయించడం మానుకోవాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కచ్చితంగా పాల్గొంటారని అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభు త్వం నుంచి అభివృద్ధి పనుల కోసం నిధులను తీసుక వచ్చిఅభివృద్ధి చేయాలని హితవు పలి కారు. గ్రామాలలో మౌలిక వసతులు పెంపొందిం చాలని సూచించారు. రాబోయే రోజుల్లో దుబ్బాక నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి కోసం చెరుకు శ్రీనివాస్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యక్రమాలలో ముందుండి నడిపిస్తారని అన్నారు. అలాగే మా పార్టీ శ్రేణులు నియోజకవర్గ వ్యాప్తంగా మా ప్రభు త్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కచ్చితంగా పాల్గొంటారని తెలిపారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం కోసం ప్రతి చోట పాల్గొంటామని అన్నారు. గత ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తిమ్మాపూర్ ఎంపీ టీసీ గ్రామం పక్కన ఉన్న చింతమడక, మాచాపూ ర్, సీతారాం పల్లి గ్రామాలకు ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చిన రోజు పక్కనే ఉన్న మా దుబ్బాక నియోజకవర్గం ప్రజలకు ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు. హైకోర్టులో కేసు వేసి ఉంటే మేము కూడా సపోర్ట్ చేసేవాళ్ళమని, అవేవీ పట్టించు కోకుండా హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి  ప్రాపకం కోసం పనికిరాని పసలేని కేసులు వేసి తాము పబ్లి సిటీ పొందాలని అనుకుంటున్నారని ఆరోపించా రు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని లేనిపక్షంలో దుబ్బాక నియోజకవర్గం ప్రజల చేతి లో పరాభవం తప్పదని హెచ్చరించారు. ఇట్టి కార్య క్రమంలో ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, గంట రేణుక రవీందర్, మాజీ సర్పంచులు బుర్ర నర్సింహులు, కొంగర నరసింహులు, జిల్లా నాయకులు ఏన్నం భూపాల్ రెడ్డి, శీనాకర్ రెడ్డి, మండల సిసిఎల్ అధ్యక్షులు లింగాల కృష్ణ, ఐఎన్టియుసి నియోజక వర్గ అధ్యక్షులు బాలమల్లు, పబ్బతి మల్లారెడ్డి, కాసర్ల నర్సింలు, కొండల్ రెడ్డి, అంజిరెడ్డి, మల్లేశం, ఉప్పలయ్య, యాదయ్య, కనికి స్వామి, నరసింహా రెడ్డి, విష్ణు, యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.