విమర్శ వర్సెస్ వాస్తవం

–  ఇన్సూరెన్స్ యొక్క అసలు విలువ

– తపన్ సింఘేల్, చైర్మన్, జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ మరియు ఎండి మరియు సిఇఒ, బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్.

 ఇన్సూరెన్ అనేది లక్షలాది మంది పౌరులు మరియు అనేక వ్యాపారాలను రక్షించిన పరిశ్రమ అయినప్పటికీ, ఆ పరిశ్రమ చేసే కృషిని నిరుత్సాహపరిచే పరిస్థితులనే తరచుగా ఎదుర్కొంటోంది. ఇటీవలి మీడియా నివేదికలతో మళ్ళీ విమర్శల వాతావరణం చోటుచేసుకుంది. ఇది ఒక సంబంధిత ప్రశ్నను లేవదీసింది: సంచలనం మాటున వివేకం మరుగున పడిపోతుందా? ఈ నివేదికల గురించి ఎంతగా చెప్పినప్పటికీ, సమస్య గురించి లోతుగా తెలుసుకోవడానికి మరియు క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకోవడానికి సమయం ఆసన్నమైంది.

ఎవరూ చూడని గొప్ప విషయం: ఒక నిశ్శబ్ద మెజారిటీ: గత సంవత్సరపు IRDAI వార్షిక నివేదిక ప్రకారం, జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ ₹1.72 లక్షల కోట్ల విలువైన కోట్ల సంఖ్యలోని క్లెయిమ్‌లను సెటిల్ చేసింది. ఇందులో హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ₹80,000 కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని ఆ రంగం చెల్లించింది. అయితే, ఆ ప్రయోజనం పొందినవారు ఆ విషయం గురించి అరుదుగా ప్రకటిస్తారు. దీనికి వ్యతిరేకంగా, చాలాకొద్ది మంది నుండి వచ్చే ఫిర్యాదులు మరియు అసంతృప్తికరమైన అనుభవాలు మాత్రమే ఈ పరిశ్రమ గురించి ప్రచారం పొందుతున్నాయి. అలాగే, ఈ పరిశ్రమలో క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి 80% కంటే ఎక్కువగానే ఉంటోంది. తిరస్కరించబడుతున్న 20% క్లెయిమ్‌లు మోసపూరితమైనవి లేదా ఆమోదయోగ్యం కానివి అయినప్పటికీ, వాటి గురించే ప్రముఖంగా పేర్కొనబడుతుంది. నిజానికి, ఇన్సూరెన్స్ అనేది ప్రజల డబ్బు కాబట్టి, ఈ డబ్బును బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నందుకు ఇన్సూరెన్స్ సంస్థలను ప్రశంసించాలి.

భద్రతకు చెల్లించే మూల్యం: దీనివల్ల వచ్చే మార్పేమీ లేదనే అనుకుందాం. కాబట్టి, పరిశ్రమ మూసివేయాలని మేము నిర్ణయించుకుంటే, అప్పుడు ఏం జరుగుతుంది?

  • వైద్య ఖర్చుల కోసం ఆదా చేయడం ద్వారా వ్యక్తులు స్వీయ ఇన్సూరెన్స్ పొందవచ్చు కదా అని కొందరు వాదిస్తారు. అయితే, ఈ విషయం పరిగణనలోకి తీసుకోండి: Niti Aayog నివేదిక ప్రకారం, భారతదేశంలో స్వంత జేబు నుండి (ఒఒపి) ఆరోగ్య ఖర్చుల కోసం వెచ్చించడమనేది ప్రస్తుతం 60%గా ఉంది. ఇన్సూరెన్స్ లేకపోతే ఇది 100%కి పెరుగుతుంది, పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో ఈ పరిస్థితి అనేది కుటుంబాలను పూర్తిగా కష్టాల్లోకి నెట్టివేస్తుంది. గణనీయ స్థాయిలో పొదుపు మొత్తాలు లేని కుటుంబాల విషయంలో వైద్య ఖర్చుల బిల్లులనేవి ఆ కుటుంబాలను దారిద్య్ర రేఖ కంటే దిగువకు తీసుకువెళతాయి. ప్రస్తుతం, ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కారణంగా భారతదేశ జనాభాలో సుమారుగా 7% మంది ప్రతి సంవత్సరం ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇన్సూరెన్స్ లేకపోతే, ఈ సంఖ్య మరింత పెరుగుతుంది మరియు ఇతర కీలకమైన రంగాలకు కేటాయించవలసిన వనరులు తగ్గించి, ఆరోగ్య సంరక్షణకు సబ్సిడీ ఇవ్వాల్సిన ఒత్తిడి ప్రభుత్వం మీద పెరుగుతుంది. అలాంటి పరిస్థితిలో మన జనాభా ద్వారా అందించబడే ఆర్థిక అనుకూలతకు విఘాతం కలుగుతుంది మరియు పేదరికాన్ని పెంచుతుంది. ఇన్సూరెన్స్ వ్యవస్థ మూతబడే పరిస్థితి వస్తే, పౌరుల కోసం ప్రత్యామ్నాయ భద్రతా కవచంతో మనం సిద్ధంగా ఉన్నామా?
  • ఇన్సూరెన్స్-ఆధారిత యాక్సిడెంట్ రక్షణతో సాగుతున్న మోటార్ పరిశ్రమ, దాదాపు ₹55 వేల కోట్ల విలువగల క్లెయిమ్ల చెల్లింపు లేకపోతే, ఉనికిలో లేకుండా పోతుంది. ఇన్సూరెన్స్-ఆధారిత యాక్సిడెంట్ రక్షణ అండతో మోటార్ పరిశ్రమ పాక్షికంగానే అభివృద్ధి చెందుతోంది. ఇన్సూరెన్స్ లేకపోతే, ప్రమాదాల వల్ల ఏర్పడే ఆర్థిక భారం పూర్తిగా వాహన యజమానుల మీదే పడుతోంది. ఇది ఆర్థిక అస్థిరతను పెంచడంతో పాటు వాహన అమ్మకాలు తగ్గడానికి దారితీస్తుంది. మన దేశంలో తప్పనిసరి అంశం అయినా మోటార్ థర్డ్ పార్టీ క్లెయిమ్‌లు కవర్ చేయడంలో ఇన్సూరెన్స్ సంస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇటీవలి IRDAI వార్షిక నివేదిక ప్రకారం, ఆర్థిక సంవత్సరం 23-24లో, మోటార్ టిపి క్లెయిమ్‌ల కోసం ఈ పరిశ్రమ రూ.27,000 కోట్లకు పైగా చెల్లింపులు చేసింది. ఇన్సూరెన్స్ పరిశ్రమ మూసివేసే పరిస్థితి వస్తే, పరిహారం రూపంలోని ఈ ఖర్చు ఎవరు భరిస్తారు? వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ దేశపు ప్రభుత్వ ఖజానా మీద ఇది మరింత భారం వేస్తుంది.
  • నవంబర్ 30, 2024 నాటికి ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి-జన ఆరోగ్య యోజన (ఎబి పిఎం-జెఎవై) కింద దాదాపుగా 36 కోట్ల లబ్ధిదారులు ధృవీకరించబడ్డారు. అలాగే, ఈ పథకం కింద ₹1.16 లక్షల కోట్లకు పైగా విలువగల 8.39 కోట్ల ఆసుపత్రి అడ్మిషన్లు అధీకృతం చేయబడ్డాయి. భారతదేశ జనాభాలో 40 శాతంగా ఉన్న ఆర్థికంగా అత్యంత బలహీనమైన దిగువ తరగతికి చెందిన 12.37 కోట్ల కుటుంబాలకు సంబంధించిన సుమారు 55 కోట్ల లబ్ధిదారులకు ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ హాస్పిటలైజేషన్ కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల హెల్త్ కవరేజీ లభిస్తోంది. ఇన్సూరెన్స్ పరిశ్రమ నుండి మద్దతు లేకపోతే, ఇన్సూరెన్స్ లేదా హైబ్రిడ్ నమూనా అనుసరించే రాష్ట్రాల్లో ఈ పథకం అమలులో ఉండదు లేదా సమర్థవంతంగా ఉండదు. అలాంటి చోట దీనికోసం అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వం స్వంతంగా భరించాల్సి ఉంటుంది. పిఐబి ప్రకారం, 2023-24లో ఆరోగ్యం మీద చేసిన ఖర్చు రూ. 5.85 లక్షల కోట్లుగా ఉంది. జిడిపిలో దీని వాటా 1.9%గా ఉంది. 2017-18లో ₹2.43 లక్షల కోట్లుగా ఉన్న ఈ ఖర్చు ఇప్పుడు ఈ స్థాయికి పెరిగింది. ఈ ఖర్చులోని ఒక చెప్పుకోదగ్గ భాగంతో తక్కువ-ఆదాయ కుటుంబాలకు మద్దతు లభిస్తోంది. ఆయుష్మాన్ భారత్ లాంటి ఇన్సూరెన్స్-ఆధారిత కార్యక్రమాలు ఈ ఆర్థిక ఒత్తిడిని తగ్గించడం ద్వారా, రాష్ట్రాలు మరియు యుటి లలోని పౌరులకు కవరేజ్ అందిస్తున్నాయి. ఇన్సూరెన్స్ లేకపోతే, ఈ భారం పెరుగుతూనే ఉంటుంది.
  • వరదలు, తుఫానులు మరియు భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాల వలన దేశంలో ఉపద్రవం సంభవించినప్పుడు, ఆ పరిస్థితి అపారమైన మానవ మరియు ఆర్థిక నష్టాలు కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ అనేది ఒక కీలకమైన రికవరీ మెకానిజంగా పనిచేస్తుంది. ఇన్సూర్ చేయబడిన మరియు వాస్తవ నష్టాల మధ్య రక్షణ అంతరాయం అనేది 90% కంటే ఎక్కువగా ఉండడమనేది ఆ అంతరాన్ని అత్యవసరంగా తగ్గించాల్సిన అవసరాన్ని సూచిస్తుంది; ఎందుకంటే, ప్రస్తుతం తుఫానులు, వరదలు మరియు భూకంపాలు లాంటివి ఏటా ఎదురయ్యే దురదృష్టాలుగా మారిపోతున్నాయి. ఒక్క 2023లోనే, 17 ప్రకృతి వైపరీత్యాలను భారతదేశం చవిచూసింది. ఇన్సూరెన్స్ లేకపోతే, ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడం మరింత ఇబ్బందికరంగా మారుతుంది. యునైటెడ్ స్టేట్స్‌ను ఒక ఉదాహరణగా తీసుకోండి: అక్కడ బలమైన ఇన్సూరెన్స్ వ్యవస్థ ఉండడం వలన ఒక వైపరీత్యం ఏర్పడిన అనంతర ఆయా ప్రాంతాలు మరింత బలంగా, భారీగా మరియు మరింత స్థిరంగా మారేలా నిర్ధారిస్తోంది. హరికేన్ కత్రినా తర్వాత, ఇన్సూర్ చేయబడిన డబ్బు అందుబాటులోకి రావడంతో మౌలిక సదుపాయాల పునఃనిర్మాణంతో పాటు ఆర్థిక వ్యవస్థ సైతం పునఃస్థితికి చేరింది. భారతదేశంలో కూడా ఇన్సూరెన్స్ అనేది మరింతగా వ్యాప్తిలోకి వస్తే, రికవరీ ప్రక్రియలో మార్పు రాగలదు, విపత్తు ప్రభావిత సమాజాలు దీర్ఘకాలం ఆ వినాశన ప్రభావంలోనే ఉండిపోకుండా వేగంగా కోలుకోగలవు. ఇక్కడ, 2021-22 నుండి 2025-26 కాలవ్యవధి కోసం జాతీయ విపత్తు ఉపశమన నిధి (ఎన్‌డిఎంఎఫ్) కోసం రూ. 13,693 కోట్లు మరియు రాష్ట్ర విపత్తు ఉపశమన నిధి (ఎస్‌డిఎంఎఫ్) కోసం రూ. 32,030.60 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించడాన్ని కూడా మనం గమనించాలి. ప్రతి ప్రకృతి వైపరీత్యం అనంతరం, ప్రభుత్వం భారీ మొత్తం పరిహారం రూపంలో ఖర్చు చేస్తోంది. ఒక బలమైన ఇన్సూరెన్స్ కార్యక్రమం ఉన్నట్లయితే, పన్ను చెల్లింపుదారులు అందించే ఈ డబ్బును అభివృద్ధి ప్రాజెక్టులు మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మళ్లించవచ్చు.
  • భారతదేశపు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న వ్యవసాయం ఎల్లప్పుడూ ప్రకృతి ప్రకోపానికి గురయ్యే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ పరిశ్రమ అండతో ఉనికిలో ఉన్న ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్‌బివై) లాంటి పథకాలు గత ఎనిమిది సంవత్సరాల్లో రూ .1.64 లక్షల కోట్ల విలువైన క్లెయిమ్‌ల కోసం చెల్లింపులు చేశాయి. ఈ చెల్లింపులనేవి రైతులకు ఆర్థిక ఉపశమనం అందించాయి, ఇబ్బందులు తగ్గించాయి మరియు రైతు ఆత్మహత్యల్లో తగ్గుదలకు దోహదపడతాయి. కరువులు, వరదలు మరియు అకాల వర్షాలతో ముడిపడిన ప్రమాదాలు తగ్గించడం ద్వారా, దేశపు ఆహార భద్రతకు దోహదపడడంలో రైతులు కొనసాగేలా ఇన్సూరెన్స్ నిర్ధారిస్తోంది. కాబట్టి, ఇన్సూరెన్స్ లేకపోతే, నష్టం నుండి ఉపశమనం అనేది తుది వరకు చేరుకుంటుందని నిర్ధారించే సమర్థవంతమైన భద్రతా కవచం ఏదీ అందుబాటులో ఉండదు.

ఇన్సూరెన్స్: అత్యంత తక్కువ ఫిర్యాదుల నిష్పత్తితో సాగే పరిశ్రమ: సాధారణ అపోహలు ఉన్నప్పటికీ, అతి తక్కువ ఫిర్యాదుల నిష్పత్తితోనే ఇన్సూరెన్స్ పరిశ్రమ ముందుకు సాగుతోంది. దీన్నిబట్టి, ఈ పరిశ్రమ అనుసరిస్తోన్న పటిష్టమైన ఫిర్యాదు పరిష్కార యంత్రాంగం గురించి అర్థం చేసుకోవచ్చు. ఇటీవలి అంకెల గురించి మాట్లాడుకుంటే, ఆర్థిక సంవత్సరం 23-24లో కేవలం 94,843 ఫిర్యాదులతో 2.96 బిలియన్ పాలసీలు పూర్తి చేయడం ద్వారా, కేవలం 0.003% ఫిర్యాదు నిష్పత్తిని మాత్రమే ఈ పరిశ్రమ నమోదు చేసింది—ఇలాంటి ఘనత చాలా కొన్ని పరిశ్రమలే దక్కించుకున్నాయి.

మోసం మీద పోరాటం: ఎవరూ పేర్కొనని యుద్ధం: మోసపూరిత క్లెయిమ్‌లనేవి ఏటా ఈ పరిశ్రమ మీద బిలియన్ల భారం మోపుతున్నప్పటికీ, దాని గురించి ఎవరూ ఎక్కువగా మాట్లాడరు. గత ఐదు సంవత్సరాల్లో, రూ.1.73 లక్షల కోట్ల సమ్ ఇన్సూర్డ్‌ మొత్తానికి సమానమైన సుమారు 3.01 లక్షల సంభావ్య మోసపూరిత కేసులను ఇన్సూరెన్స్ పరిశ్రమ గుర్తించింది. ఒక పరిశోధన ప్రకారం, మోసాల కారణంగా, భారతీయ జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ ఏటా సుమారుగా 6 బిలియన్ల అమెరికన్ డాలర్లను కోల్పోతోంది. దాదాపుగా రూ. 30,000 కోట్లకు సమానమైన మొత్తం ఇది. అయితే, ఇలాంటి మూల కారణాలను విస్మరిస్తూ, క్లెయిమ్‌ల తిరస్కరణల మీద మాత్రమే అందరూ దృష్టి పెడుతుంటారు. అంటే, ఎలాంటి తనిఖీ లేకుండా మోసపూరిత క్లెయిమ్‌లు ఆమోదించాలా? వ్యవస్థను తప్పుదోవ పట్టించే వాళ్ల మీద కఠిన జరిమానాలు విధించకూడదా? తనిఖీ చేయకుండా మోసాన్ని అనుమతించడం వల్ల మొత్తం ఇన్సూరెన్స్ వ్యవస్థ మీద విశ్వాసం మరియు స్థిరత్వం తగ్గిపోతుంది.

లాభాలు అనే అపోహ: ఇన్సూరెన్స్ సంస్థలు భారీ లాభాలు ఆర్జిస్తున్నాయి మరియు లాభాలు కోసమే ఆ వ్యవస్థ ఉనికిలో ఉంది. అన్నింటికంటే ముందు, ఇన్సూరర్‌కు లాభం దక్కకూడదా? భవిష్యత్తు క్లెయిమ్‌లను ఇన్సూరర్‌లు గౌరవించడంతో పాటు స్థిరంగా వ్యాపారాన్ని కొనసాగించడానికి లాభాలు సహకరిస్తాయి. అండర్‌రైటింగ్ లాభాలు అనేవి వివేకాన్ని సూచిస్తాయి. ఇప్పుడు, నాణేనికి మరొక వైపు చూస్తే, జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ 80% కంటే ఎక్కువ సగటు క్లెయిమ్‌ల నిష్పత్తి మరియు 115% సంయుక్త నిష్పత్తితో పనిచేస్తోంది. అంటే, ప్రీమియంల రూపంలో సంపాదించే ప్రతి  రూ .100 కోసం, పరిశ్రమ రూ . 115 చెల్లిస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే, క్లెయిమ్స్ చెల్లింపులు మరియు కార్యాచరణ ఖర్చుల రూపంలో ఇన్సూరర్‌లు డబ్బు కోల్పోతున్నారు. అయితే, ధరలో ప్రతి చిన్న పెరుగుదల సైతం ప్రజల మీద భారం పెంచగలదు. అలాంటప్పుడు, ఈ “దుష్ట” పరిశ్రమను మూసివేయొచ్చు కదా!
ఇది పౌరుల ద్వారా నడపబడే ఒక పరిశ్రమ: ఒక మిలియన్‌కి పైగా వ్యక్తులకు ప్రత్యక్షంగా మరియు 5 మిలియన్లకు పైగా వ్యక్తులకు పరోక్షంగా ఇన్సూరెన్స్ కంపెనీలు పెద్ద సంఖ్యలో జీవనోపాధిని అందిస్తున్నాయి. అందుకే, ఇది లాభాలు మాత్రమే ఆశించే దుష్ట పరిశ్రమ కాదు. నిజానికి ఇది జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేసే ఒక పరిశ్రమ. బ్రోకర్లు, టిపిఎలు మరియు ఇన్సూర్‌టెక్‌లు లాంటి వ్యవస్థాపకులు దీనికి మరింత విలువ జోడిస్తున్నారు. ఇది ఆర్థిక మరియు ఉపాధి వృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

పరిస్థితిలో మార్పు తీసుకురావడం: భారతదేశంలో ఇన్సూరెన్స్ వృద్ధి అత్యంత తక్కువ వేగంతో 1% వద్దే ఉంది. అవగాహన పెంచడానికి మరియు కవరేజీ విస్తరించడానికి పరిశ్రమ నిరంతరం పనిచేస్తూనే ఉంది. అయితే, నిర్మాణాత్మక చర్చ లేకుండానే చేయబడుతున్న విమర్శలనేవి పరిశ్రమను దూరం చేసే ప్రమాదాన్ని సృష్టిస్తుంది, భవిష్యత్తు పురోగతిని దెబ్బతీయడంతో పాటు విశ్వాసం తగ్గిస్తున్నాయి. ఇన్సూరెన్స్ వ్యాప్తి పెరిగే కొద్దీ, దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని మనం అర్థం చేసుకోవాలి; అలా జరక్కపోతే, బహుశా మనం వెనక్కి వెళ్లిపోతాము! ఇన్సూరెన్స్ అనేది ఏం సూచిస్తుందో మర్చిపోకండి: అది ఒక భద్రతా కవచం, అత్యవసర సమయంలో ఒక అండ మరియు కలలకి రక్షణ అందించేది. మెరుగుదల కోసం అవకాశం ఉందా? ఉంది, పరిశ్రమ స్థిరంగా వృద్ధి చెందుతోంది. పరిశీలనను ఇన్సూరెన్స్ పరిశ్రమ స్వాగతించినప్పటికీ, న్యాయమైన విచక్షణను కోరుకుంటోంది. మంచి విషయాలు హైలైట్ చేయండి, చెడుని పరిష్కరించండి మరియు ముందుకు సాగే మార్గం మీద దృష్టి పెట్టండి. ఇన్సూరెన్స్ ఒక దుష్ట పరిశ్రమ అని మీరు ఇప్పటికీ భావిస్తే, దాన్ని మూసివేసి, మన పౌరుల కోసం వేరొక ప్రత్యామ్నాయ భద్రతా కవచం అందించండి. అలా చేసేవరకు—విధ్వంసం కలిగించే విమర్శించడమా లేదా నిర్మాణాత్మకంగా వ్యవహరించడమా అనే ఎంపిక మన చేతిలోనే ఉంటుంది.