భారీ వర్షాలకు, పొంగుతున్న వాగులు వంకలు

నవ తెలంగాణ – రేవల్లి

రేవల్లి మండల మొత్తంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అలాగే, మండలంలో ఉన్న చెరువులన్నీ సగంపైనే నిండిపోయాయి. కనీసం మూడున్నర గంటల సమయం పైనే  కురిసినటువంటి వర్షం వల్ల రేవల్లి మండలం లోని అన్ని గ్రామాలలో చిన్న చిన్న పిల్ల కాలువలతో సహా., వరి చేలు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి. మండలంలో కొన్నిచోట్ల పూర్తిగా నిండిపోగా, మరికొన్నిచోట్ల, వరిచేలలో సగానికి పైగా మీరు నిండినది. ఈ విషయంలో కొందరు రైతులు ఆనందం వ్యక్తం చేయగా, మరి కొందరు పంట నష్టం అయిపోతుంది అని ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షం ఇలానే ఉంటే పైరు పెరిగే పరిస్థితిలో ఉంది కాబట్టి, పెరగదేమోనని వాపోతున్నారు.