పంట ఋణం పరిమితి పెంచాలి

– పొగాకు రైతులకు అదనపు ఋణం ఇవ్వాలి
– మంత్రి తుమ్మలను కోరిన స్థానిక నేత జ్యేష్ట
– వినతి పత్రం అందజేత..
నవతెలంగాణ – అశ్వారావుపేట
పెరిగిన భహిరంగ మార్కెట్ ధరలు రీత్యా రైతులకు పంట ఋణ పరిమితి పెంచాలని,గతంలో సంబంధించిన తుపాన్ కారణంగా నష్టపోయిన పొగాకు సాగుదారులకు బ్యాంక్ లు అదనపు ఋణం అందజేయాలని కోరుతూ బుధవారం హైద్రాబాద్ లోని వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను స్థానిక కాంగ్రెస్ నాయకులు జ్యేష్ట సత్యనారాయణ చౌదరి మంత్రి చాంబర్ లో కలిసి వినతి పత్రం అందజేసారు. వినతి లో వివరాలు ప్రకారం తుఫాన్ కారణంగా నష్టపోయిన పొగాకు రైతులకు అన్ని బ్యాంకులు అదనంగా రూ.1 లక్ష ఋణం పెంచి ఇస్తున్నారు అని అలాగే నాగార్జున గ్రామీణ వికాస్ బ్యాంకులో ఖాతాలు కలిగిన పొగాకు రైతులకు కూడా రూ.1 లక్ష  అదనంగా పెంచి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.దీంతో వెంటనే స్పందించిన  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బ్యాంకు అధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆదేశించారు.