– పంట నష్టం వివరాలను వేంటనే అందించాలి..
– అధికారులను ఆదేశించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
శనివారం సాయంత్రం వడగళ్ళ వాన కురియటం వలన నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందనే వార్తలు అందిన నేపథ్యంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి నియోజకవర్గంలోని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆదివారం గ్రామాల్లోని రైతులతో మాట్లాడి రైతుల వారిగా నష్టం అంచనాలను వేసి కలెక్టర్ కు వేంటనే నివేదిక ను సమర్పించాలని , ఏ ఒక్క రైతును విస్మరించరాదని, అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలతో రైతులకు తీరని నష్టాన్ని కలిగించాయని,ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి విచారం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ప్రతీ రైతును ఆదుకుంటుందని రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని రైతులకు భరోసా ఇచ్చారు.