త్రివేణి సంగమంలో భక్తులకు సందడి..

నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం కందకుర్తి గోదావరి త్రివేణి సంగంలో శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది.  ఏరువాక సత్యగంగ పౌర్ణమి పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి పుణ్య స్థానాలను ఆచరించారు. సుమారు రెండు వేల పై చిలుకు భక్తులు కందకుర్తి గోదావరి త్రివేణి సంగమంలో తమ మొక్కలను తీర్చుకున్నారు. గోదావరి నీటిలో తిప్పలు విడిచి మొక్కలు తీర్చుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పూజా కార్యక్రమాల అనంతరం వంటలు చేసుకొని తమ కుటుంబ సభ్యులు బంధువులతో ఆనందంగా గడిపారు. గత వారం రోజుల కిందట ఎడారిగానున్న గోదావరిలో ఇసుక దిబ్బలు ఉండగా, ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరి, మంజీరా నదులు నీతి వదిలిపెట్టి పెరగడంతో భక్తులకు పుణ్య స్థానంలో ఆచరించడానికి అనుకూలంగా మారింది.