మేడారంలో భక్తుల సందడి..

Crowd of devotees in Medaram..నవతెలంగాణ –  తాడ్వాయి  
వనదేవతల దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. ఆదివారం సెలవుదినం కావడం భక్తులు వేలాదిగా దూర ప్రాంతాల నుండి భక్తులు తల్లుల దర్శనానికి పిల్లా పాపలతో తరలివచ్చారు. తల్లులకు మొక్కులు చెల్లించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన చత్తీస్గఢ్ మహారాష్ట్రా నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మొదట జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తల్లుల గద్దెలకు చేరుకొని పూలు,కుంకుమ, బంగారం, కొత్త బట్టలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ అధికారులు, ఆలయ పూజారులు సకల సౌకర్యాలు కల్పించారు.వేలాది మంది భక్తుల రాకతో ఆదివారం నాడు మేడారం పరిసరాలు భక్తులతో జనసంద్రంగా మారాయి. కాగా మేడారంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ములుగు జిల్లా ఎస్పీ శబరిస్ ఆదేశాల మేరకు స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి భారీ బందోబస్తు నిర్వహించారు. దర్శనాలు సులువుగా జరిగే విధంగా అన్ని చర్యలు చేపట్టారు.